ప్రజాశక్తి - కౌతాళం
రాష్ట్ర ప్రజల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని వైసిపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వై.ప్రదీప్ రెడ్డి, మహేందర్ రెడ్డి తెలిపారు. శనివారం మండలంలోని కామవరం గ్రామంలో 'గడపగడపకు మన ప్రభుత్వం' నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఎలా ఉన్నాయో ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాలు ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేదన్నారు. ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే నాయకులని, ప్రజలకు ఏ సమస్య వచ్చినా వెంటనే స్పందించే నాయకులని తెలిపారు. అనంతరం కామవరం గ్రామానికి చెందిన దస్తగిరి సాబ్ కుమారులు ఇర్ఫాన్, ఇమ్రాన్ అంగవైకల్యం చూసి ఎమ్మిగనూరుకు వచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక్కొక్కరికి రూ.లక్ష ఆర్థిక సహాయం మంజూరు చేసినట్లు చెప్పారు. వైసిపి సీనియర్ నాయకులు వీరసేనారెడ్డి, ఎంపిపి అమ్రేష్, వైస్ ఎంపిపి బుజ్జిస్వామి, వెంకటరామిరెడ్డి, సర్పంచి వసంత్ కుమార్ పాల్గొన్నారు.
ప్రజలతో మాట్లాడుతున్న ప్రదీప్ రెడ్డి










