Oct 25,2023 21:47

ప్రజల ప్రభుత్వాన్ని ఆదరించండి: ఎమ్మెల్యే

ప్రజల ప్రభుత్వాన్ని ఆదరించండి: ఎమ్మెల్యే
ప్రజాశక్తి-శ్రీకాళహస్తి: ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పాలన సాగిస్తున్న వైసీపీ ప్రభు త్వాన్ని ప్రజలు మరోసారి ఆదరించాలని ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌ రెడ్డి పిలుపు నిచ్చారు. గడపగడపకు మన ప్రభుత్వంలో భాగంగా బుధవారం ఆయన పట్టణం లోని 4వ వార్డు ముత్తరాశిపాలెం, నక్క హరిజనవాడ, సున్నపు హరిజనవాడ, ఏనుగుల గుంటలో పర్యటించారు. ప్రజలు బ్రహ్మరథం పట్టారు. లబ్ధిదారుల వద్దకు వద్దకు వెళ్లి 'ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా? లేదా?' అని అడుగుతూ ముందుకు సాగారు. స్థానిక సమస్యలను ప్రజలు ఎమ్మెల్యే దష్టికి తీసుకురాగా వాటి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రజల సమస్యలు వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జనార్దన్‌ రావు పవార్‌, గుమ్మడి బాలకష్ణయ్య, పగడాల రాజు, ముత్యాల పార్థసారథి, పంతులు పాల్గొన్నారు.