ప్రజాశక్తి - కోసిగి
వైఎస్‌ఆర్ హెల్త్ క్లినిక్ ఏర్పాటుతో ప్రజల ముంగిటకే వైద్య సేవలందుతున్నాయని ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి తెలిపారు. మండలంలోని వందగల్లు గ్రామంలో రూ.17.50 లక్షలతో నిర్మించిన వైఎస్‌ఆర్ హెల్త్ క్లినిక్‌ను మంగళవారం వైసిపి మండల ఇన్‌ఛార్జీ మురళీమోహన్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. కోల్మాన్ పేట గ్రామంలో రూ.18 లక్షల 15వ ఆర్థిక సంఘం, ఎంపీ నిధులతో చేపట్టిన రక్షిత మంచినీటి సరఫరా పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. జగనన్న ఆరోగ్య సురక్ష, వై ఎపి నీడ్స్ జగన్, బస్సు యాత్ర వంటి కార్యక్రమాలతో ప్రజలతో మమేకమై 2024 ఎన్నికల్లో జగనన్న సారథ్యంలో ప్రభంజనం సృష్టించాలని కోరారు. వందగల్లు సర్పంచి కాల్వ కోరవంజమ్మ, కోల్మాన్ పేట సర్పంచి జి.జయరాం, డిఇ అశ్వత్థామ, ఎఇలు యుగంధర్ రెడ్డి, మల్లికార్జున రెడ్డి, ఆర్లబండ సహకార సంఘం అధ్యక్షులు నాడిగేని నరసింహులు, ఐరనగల్లు శ్రీనివాసరెడ్డి, దశరథ్ రెడ్డి, జగదీష్ స్వామి, ఎన్.నాగరాజు, దొడ్డి నర్సన్న, నరసింహులు గౌడ్, బుళ్లి నరసింహులు, మల్లికార్జున గౌడ్, కాల్వ లక్ష్మయ్య, ఎన్.నరసింహులు, జడ్ల అంజినయ్య, ఈరన్న, నేలకోసిగి లక్ష్మన్న, జి.హనుమంతు, ఉప్పలపాటి అర్జున్, అయ్యప్ప, సహాదేవ, వి.రమేష్, ఎ.వెంకోబ, గోపాలకృష్ణ పాల్గొన్నారు.
మంచినీటి పథకాన్ని ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి










