ప్రజల కోసమే జగనన్న సురక్ష - ఎమ్మెల్యే శిల్పా
ప్రజాశక్తి నంద్యాల రూరల్
ప్రజల కోసమే జగనన్న సురక్ష కార్యక్రమం నిర్వహించబడుతుందని నంద్యాల శాసనసభ్యులు రవిచంద్ర కిషోర్ రెడ్డి పేర్కొన్నారు. నంద్యాల మండలంలోని పోలూరు గ్రామంలో జగనన్న సురక్ష కార్యక్రమం మంగళవారం నిర్వహించడం జరిగిందని,ఇందులో 548 మందికి కావలసిన ధ్రువపత్రాలను ఎమ్మెల్యే చేతుల మీదుగా పంపిణీ చెయ్యడం జరిగిందని పంచాయతీ కార్యదర్శి లక్ష్మన్న తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రవిచంద్ర కిషోర్ రెడ్డి మాట్లాడుతూ.. గ్రామంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా మరిన్ని సమస్యలకు పరిష్కారం చేయడం జరిగిందని వైఎస్ఆర్ ప్రభుత్వంలో వచ్చినప్పటినుండి సచివాలయం సిబ్బంది వాలంటీర్లు మా ఇళ్ల వద్దకు వచ్చి మా సమస్యలను తెలుసుకొని పరిశీలిడం జరుగుతుందని అన్నారు.ప్రభుత్వం చేపట్టిన వివిధ రకాల ధ్రువీకరణ పత్రాలను ఉచితంగా అందజేశామని ఎంపీపీ తెలిపారు. ప్రజలకు అవసరమైన 11రకాల దృవీకరణ పత్రాలను సిబ్బంది గుర్తించి ఉచితంగా అందజేస్తున్నరని తెలిపారు. సాధారణంగా కుల, ఆదాయ, కుటుంబ, రేషన్ కార్డు విభజన వంటి దృవీకరణ పత్రాలు సద్వినియోగం చేసుకోవాలని గతంలో ఏ సర్టిఫికెట్ తీసుకోవాలన్న రోజుల తరబడి నిరీక్షించాల్సిన అవసరం ఉండేదని, ప్రజలు కష్టాలు తెలుసుకున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం పట్ల ప్రజలు కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారని తెలిపారు.అనంతరం లబ్ధిదారులకు సర్టిఫికెట్ లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ మహేశ్వర్ రెడ్డి రాష్ట్ర బెస్త సంఘం డైరెక్టర్ చంద్రశేఖర్ నంద్యాల మండల కన్వీనర్ బసవేశ్వర రెడ్డి గ్రామ సర్పంచ్ ప్రతాప్ వైస్ సర్పంచ్ బాలచంద్రారెడ్డి మునగాల సర్పంచ్ లోకేశ్వర్ రెడ్డి మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ సిద్ధం శివరాం వైసిపి నాయకులు నాగేశ్వర్ రెడ్డి పై రెడ్డి సుధాకర్ రెడ్డి సాయిరాం రెడ్డి మరియు గ్రామ నాయకులు ప్రభుత్వ అధికారులు వాలంటరీలు పాల్గొన్నారు.










