'సురక్ష'లో మాట్లాడుతున్న నాయకులు
ప్రజాశక్తి - మంత్రాలయం
ప్రజలకు వైద్య సేవలను అందుబాటులోకి తెచ్చిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని వైసిపి మండలాధ్యక్షులు భీమిరెడ్డి, ఇన్‌ఛార్జీ విశ్వనాథ్ రెడ్డి తెలిపారు. సోమవారం ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి ఆదేశాల మేరకు మండలంలోని మాధవరం గ్రామంలో 'జగనన్న ఆరోగ్య సురక్ష' నిర్వహించారు. ముందుగా వైద్య సేవల గురించి వృద్ధులతో మాట్లాడి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అధికారులు ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను సందర్శించారు. ప్రభుత్వం అందించిన వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని ప్రజలను కోరారు.










