Aug 05,2023 19:17

సమావేశంలో మాట్లాడుతున్న విజయభాస్కర్‌ గౌడ్‌

ప్రజాశక్తి- దేవనకొండ
టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు సభలకు వచ్చే ప్రజా స్పందనను చూసి ఓర్వలేకనే వైసిపి నాయకులు దాడులకు పాల్పడుతున్నారని టిడిపి మండల కన్వీనర్‌ విజయభాస్కర్‌ గౌడ్‌ తెలిపారు. శనివారం టిడిపి కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. చిత్తూరు జిల్లా పుంగనూరులో చంద్రబాబు నాయుడుపై దాడిని హేయమని తెలిపారు. రాష్ట్రంలో ఆటవిక రాజ్యం రాజ్యమేలుతోందన్నారు. ఇలాంటి దాడులకు టిడిపి నాయకులు, కార్యకర్తలు భయపడరని తెలిపారు. టిడిపి మండల నాయకులు బడిగింజల రంగన్న, ఉచ్చీరప్ప, రామారావు నాయుడు, మల్లయ్య, వీరేష్‌, మాలిక్‌, మల్లికార్జున్‌ గౌడ్‌, టిఎన్‌ఎస్‌ఎఫ్‌ నాయకులు పెద్దయ్య, తెలుగు యువత నాయకులు రాజా సాహెబ్‌, రాజశేఖర్‌ గౌడ్‌, డీలర్‌ బండ్లయ్య, నాగరాజు గౌడ్‌, మస్తాన్‌ పాల్గొన్నారు.