43వ వార్షికోత్సవ ప్రత్యేక సంచిక ఆవిష్కరణలో కలెక్టర్ ప్రసన్న వెంకటేష్
ప్రజాశక్తి - ఏలూరు అర్బన్
ప్రజాశక్తి దినపత్రిక మరిన్ని వార్షికోత్సవాలు జరుపుకోవాలని, భవిష్యత్తులో మరింతగా పురోగమిస్తూ ముందుకు సాగాలని జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ ఆకాంక్షించారు. మంగళవారం ప్రజాశక్తి ఏలూరు, నూజివీడు డివిజన్ల 43వ వార్షికోత్సవ ప్రత్యేక సంచికను కలెక్టర్ తన ఛాంబర్‌లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రసన్న వెంకటేష్ మాట్లాడుతూ ప్రజా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకొస్తూ సమస్యల పరిష్కారానికి 'ప్రజాశకి'్త కృషి చేయాలన్నారు. వాస్తవాలు క్షుణ్ణంగా పరిశీలించి పత్రికలో ప్రచురిస్తే ప్రజాదరణ ఉంటుందని, అప్పుడే పత్రికల జనాల్లో నమ్మకం పెరుగుతుందని అన్నారు. ప్రభుత్వ పథకాలను లబ్ధిదారులకు అందించడంలో ప్రజాశక్తి తనదైన పాత్ర పోషించాలని కోరారు. ప్రజా సమస్యలను ప్రచురించడంలో 'ప్రజాశక్తి'కి ప్రత్యేకత ఉందని, భవిష్యత్తులో అదే ఒరవడి కొనసాగించాలని సూచించారు. సామాన్య ప్రజానీకం పడుతున్న ఇబ్బందులను ఎప్పుటికప్పుడు 'ప్రజాశక్తి' వెలుగులోకి తీసుకొస్తే అధికారుల దృష్టికి తీసుకొస్తే వెంటనే పరిష్కరించేందుకు చర్యలు చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సమన్వయ కమిటీ కన్వీనర్, డెస్క్ ఇన్‌ఛార్జి విఎస్‌ఎస్‌వి.ప్రసాద్, స్టాఫ్ రిపోర్టర్ పి.గంగరాజు, ఎడివిటి జిల్లా ఇన్‌ఛార్జి పి.నారాయణరాజు, సిబ్బంది వై.సీతారాం, ఎం.సాంబమూర్తి, టి.సత్యవతి, విలేకరులు వి.శ్యాంబాబు, యు.శ్రీనివాస్, డి.నాని పాల్గొన్నారు.










