Jun 07,2023 22:20

కరపత్రాలు విడుదల చేస్తున్న రోటరీ క్లబ్‌ ప్రతినిధులు

ప్రజాశక్తి ధర్మవరలో టౌన్‌ : పేద ప్రజలకు సేవ చేయడములోనే ఎంతో సంతృప్తి ఉందని రోటరీ క్లబ్‌ అధ్యక్ష, కార్యదర్శులు కృష్ణమూర్తి, రామకృష్ణ, కోశాధికారి జయసింహ, క్యాంపు చైర్మన్‌ సోలిగాళ్ళ వెంకటేశులు పేర్కొన్నారు. సాంస్కృతిక మండలిలో ఈనెల 11న రోటరీ క్లబ్‌ ఆధ్వర్యంలో నిర్వహించబడే ఉచిత కంటి ఆపరేషన్ల వైద్య శిబిరానికి సంబందించిన కరపత్రాలను వారు బుధవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ ఉచిత కంటి ఆపరేషన్ల వైద్య శిబిరం కేవలం పేద ప్రజలకు కంటి వెలుగును ప్రసాదించడానికే అని అన్నారు. కోట మున్సిపల్‌ పాఠశాలలో ఈశిబిరం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. రోటరీ క్లబ్‌, శంకర కంటి ఆసుపత్రి బెంగళూరు, జిల్లా అంధత్వ నివారణ సంస్థ అనంతపురం జిల్లా సహాయ సహకారాలతో ఈ శిబిరం నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు నరేందర్‌ రెడ్డి, సభ్యులు నాగభూషణం, కొండయ్య, సత్రశాల ప్రసన్నకుమార్‌, తదితరులు పాల్గొన్నారు.