గర్భిణులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్న డాక్టర్ గీతావాణి
ప్రజాశక్తి - ఆస్పరి
ప్రజల ఆరోగ్య పరిరక్షణే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తోందని సర్పంచి నెల్లూరప్ప తెలిపారు. శనివారం మండలంలోని జొహరాపురం గ్రామంలో 'జగనన్న ఆరోగ్య సురక్ష' నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 'ఆరోగ్య సురక్ష' వైద్య శిబిరం పేదలకు ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. వృద్ధులకు, గర్భిణులకు షుగర్, బిపి పరీక్షలు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. డాక్టర్ మారుతి కుమార్ మాట్లాడుతూ... గ్రామంలో నిర్వహించిన 'జగనన్న సురక్ష'లో 408 మందికి వైద్య పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. స్పెషలిస్టులు గీతావాణి, డాక్టర్లు మాధవి లత, రోషిని పాల్గొన్నారు.










