Sep 19,2023 19:26

ఆస్పత్రిని ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే సాయి ప్రసాద్‌ రెడ్డి

ప్రజాశక్తి-ఆదోనిరూరల్‌
ప్రజారోగ్యమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే వై.సాయిప్రసాద్‌రెడ్డి, ఎమ్మెల్సీ డాక్టర్‌ మధుసూదన్‌ తెలిపారు. సోమవారం పట్టణంలో రెండు నూతన ఆస్పత్రులను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ప్రజారోగ్యం, పేదల జీవితాల్లో వెలుగులు నింపేదుకు ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి కృషి చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వాస్పత్రుల్లో మాత, శిశుఆస్పత్రి, ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి 200 పడకల ఆస్పత్రిగా నూతన భవనం ఏర్పాటు చేశామన్నారు. రూ.475 కోట్లతో మెడికల్‌ కళాశాలను ఆదోనికి రావడం సంతోషకరమని చెప్పారు. గత టిడిపి ప్రభుత్వంలో పేదలు వైద్యానికి దూరమై మృతి చెందేవారని తెలిపారు. ప్రభుత్వాస్పత్రిలో అన్నీ సక్రమంగా ఉన్నాయని, సమస్యలుంటే తన దృష్టికి తీసుకురావాలని కోరారు. మున్సిపల్‌ ఛైర్మన్‌ బోయ శాంత, మార్కెట్‌ యార్డు వైస్‌ ఛైర్మన్‌ కామాక్షి తిమ్మప్ప, వైఎస్‌ఆర్‌ డాక్టర్స్‌ అసోసియేషన్‌ డైరెక్టర్‌ కృష్ణమూర్తి, ఆస్పత్రి సూపరింటెండెంట్‌ మాధవి లత, రవికుమార్‌, వైసిపి పట్టణ గౌరవాధ్యక్షులు చంద్రకాంతరెడ్డి, వైసిపి సీనియర్‌ నాయకులు ఇస్మాయిల్‌, దస్తగిరి నాయుడు, నారాయణ, కల్పవళ్లి, కౌన్సిలర్లు సందీప్‌ రెడ్డి, సురేష్‌ చిన్న, చలపతి, ఆర్‌టిసి రెహమాన్‌ పాల్గొన్నారు.