ప్రజాశక్తి-ఆలూరు
టిడిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు వస్తున్న ప్రజాదరణను చూసి ఓర్వలేకనే అక్రమంగా కేసులు అరెస్టు చేయించారని మాజీ ఎమ్మెల్యే, టిడిపి ఇన్‌ఛార్జీ కోట్ల సుజాతమ్మ విమర్శించారు. మంగళవారం ఆలూరు పాతబస్టాండ్‌లో ఏర్పాటు చేసిన నిరాహార దీక్షల్లో ఆమె మాట్లాడారు. జగన్ రెడ్డి అధికారం పోతే శాశ్వతంగా జైలులో ఉండాల్సి వస్తుందనే భయంతోనే స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబుపై తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపారని తెలిపారు. ముఖ్యమంత్రి జగన్ రెడ్డి, మంత్రుల అరాచకాలు, అక్రమాలను ప్రజల ముందు ఉంచుతున్నందుకు కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే చంద్రబాబును అరెస్టు చేయించారని విమర్శించారు. టిడిపి రాష్ట్ర నాయకులు నారాయణ రెడ్డి, నారాయణ, జిల్లా నాయకులు నరసప్ప, నాగరాజు, కొమ్ము రామాంజి, సురేందర్, మండల కన్వీనర్లు అశోక్ యాదవ్, షేక్షావలీ, సర్పంచి ఎల్లప్ప, పట్టణ అధ్యక్షులు చంద్రశేఖర్, ముద్ద రంగ, గూళ్యం రామాంజినేయులు, అరికేర అంజనేయ్య, సులవాయి రాఘవేంద్ర, వెంకటేశ్వర రెడ్డి, వెంకటేశ్వర్లు, మసాల జగన్, శివ, రాము యాదవ్, రాజు కుమార్ పాల్గొన్నారు.
నిరాహార దీక్షలో మాట్లాడుతున్న కోట్ల సుజాతమ్మ










