Sep 12,2023 21:46

మహిళతో మాట్లాడుతున్నఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తనయుడు హర్షవర్ధన్‌రెడ్డి

          ప్రజాశక్తి-పెద్దపప్పూరు   ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పాలన సాగిస్తోందని ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తనయుడు హర్షవర్ధన్‌రెడ్డి తెలిపారు. మంగళవారం మండల పరిధిలోని తురకపల్లి గ్రామంలో గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా ఇంటింటికీ వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకోవడంతోపాటు ప్రభుత్వం పథకాలను వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడా అవినీతికి తావు లేకుండా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ఘనత సిఎం జగన్‌కే దక్కుతుందన్నారు. అంతేగాకుండా అర్హులందరికీ పార్టీలు, కులమతాలకు అతీతంగా పథకాలు అమలు చేస్తున్నారన్నారు. ఇలాగే పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందాలంటే జగనన్న ప్రభుత్వం మరోసారి రావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు రావిరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి రవిప్రసాద్‌రెడ్డి, మండల కన్వీనర్‌ అమర్నాథ్‌రెడ్డి, మాజీ మండల అధ్యక్షులు రామ్మూర్తిరెడ్డి, రామేశ్వర్‌రెడ్డి, తురకపల్లి శివారెడ్డి, లక్ష్మీరెడ్డి, జనార్ధన్‌రెడ్డి, శంకర్‌రెడ్డి, సింగిల్‌విండో అధ్యక్షులు అమర్నాథ్‌రెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు సూర్యనారాయణ, ఆర్‌డబ్ల్యూఎస్‌ సిబ్బంది, ఎంపిడిఒ, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.