Jul 31,2023 20:41

ప్రభుత్వ లబ్ధి పత్రాలను అందిస్తున్న జగన్మోహన్‌ రెడ్డి

ప్రజాశక్తి - ఎమ్మిగనూరు
ప్రజా సంక్షేమమే వైసిపి ప్రధాన ధ్యేయమని వైసిపి సీనియర్‌ నాయకులు ఎర్రకోట జగన్మోహన్‌ రెడ్డి తెలిపారు. సోమవారం పట్టణంలోని 22వ వార్డులో మూడోరోజు 'గడపగడపకు మన ప్రభుత్వం' నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వం అందిస్తున్న పథకాలను, వాటి ద్వారా పొందిన లబ్ధిని వివరించారు. వార్డు పరిధిలోని కొన్ని వీధుల్లో సిసి రోడ్లు, డ్రెయినేజీలు, తదితర సౌకర్యాలు కల్పించాలని ప్రజలు ఆయన దృష్టికి ప్రజలు తెచ్చారు. సమస్యలను పరిష్కరించాలని మున్సిపల్‌ అధికారులను ఆయన ఆదేశించారు. అనంతరం ఆయన మాట్లాడారు. ఇచ్చిన హామీలన్నీ నేరవేర్చి ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి పాలన సాగిస్తున్నారని తెలిపారు. ప్రస్తుతం అన్ని వార్డుల్లో ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డి సహకారంతో అభివృద్ధి పనులు వేగవంతంగా జరుగుతున్నాయని చెప్పారు. పట్టణంలోని అన్ని వార్డులను అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ప్రణాళిక ప్రకారం సిసి రోడ్లు, డ్రెయినేజీల నిర్మాణాలను చేపడుతున్నామని తెలిపారు.