Sep 08,2023 19:50

వృద్ధురాలితో మాట్లాడుతున్న ప్రదీప్‌ రెడ్డి

ప్రజాశక్తి - పెద్దకడబూరు
ప్రజాసంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని వైసిపి యువజన నాయకులు వై.ప్రదీప్‌ రెడ్డి తెలిపారు. శుక్రవారం మండలంలోని కల్లుకుంట గ్రామంలో రోజున 'గడపగడపకు మన ప్రభుత్వం' నిర్వహించారు. ముఖ్య అతిథిగా ప్రదీప్‌రెడ్డి హాజరయ్యారు. గ్రామంలో ప్రతి గడపకూ వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలను ప్రతి ఒక్కరికీ అందుతున్నాయని తెలిపారు. వచ్చే 2024 ఎన్నికల్లో వైసిపి ప్రభుత్వం అధికారం చేపడితే ప్రతి కాలనీకీ సిసి రోడ్లు, డ్రెయినేజీలు వేయిస్తామని హామీ ఇచ్చారు. రామ్మోహన్‌ రెడ్డి, పురుషోత్తం రెడ్డి, చంద్రశేఖర్‌ రెడ్డి, మాజీ ఎంపిపి రఘురామ్‌, సర్పంచి ఇస్మాయిల్‌, మాజీ సర్పంచి సత్యనారాయణ, బాలముని, డీలర్‌ నర్సింగప్ప, కటిక మహ్మద్‌, విజరు కుమార్‌, షేర్‌ఖాన్‌, అమీర్‌ ఖాన్‌ పాల్గొన్నారు.