లబ్ధిదారులకు పత్రాలను అందజేస్తున్న ప్రదీప్ రెడ్డి
ప్రజాశక్తి - పెద్దకడబూరు
ప్రజాసంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని వైసిపి రాష్ట్ర యువజన నాయకులు వై.ప్రదీప్‌రెడ్డి తెలిపారు. శనివారం మండలంలోని కల్లుకుంట గ్రామంలో రెండోరోజూ 'గడపగడపకు మన ప్రభుత్వం' నిర్వహించారు. గ్రామంలో ప్రతి గడపకూ వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలు ప్రతి కుటుంబానికీ అందాయని తెలిపారు. అందని వారికి త్వరలోనే అందేటట్లు చూస్తామని హమీఇచ్చారు. నాయకులు రామ్మోహన్ రెడ్డి, పురుషోత్తం రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, మాజీ ఎంపిపి రఘురాం, సర్పంచి ఇస్మాయిల్, మాజీ సర్పంచి సత్యనారాయణ, బాలముని, డీలర్ నర్సింగప్ప, కటిక మహ్మద్, విజరు కుమార్, షేర్‌ఖాన్, అమీర్ ఖాన్ పాల్గొన్నారు.










