సమస్యలు తెలుసుకుంటున్న ప్రదీప్ రెడ్డి
ప్రజాశక్తి - పెద్దకడబూరు
ప్రజాసంక్షేమమే ధ్యేయంగా వైసిపి ప్రభుత్వం రాష్ట్రంలో పరిపాలన సాగిస్తోందని వైసిపి రాష్ట్ర యువజన నాయకులు వై.ప్రదీప్‌రెడ్డి తెలిపారు. గురువారం మండలంలోని నాగలాపురం గ్రామంలో 'గడపగడపకు మన ప్రభుత్వం' నిర్వహించారు. ఎంపిడిఒ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ప్రదీప్‌రెడ్డి ఇంటింటికీ వెళ్లి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వైసిపి నాయకులు పురుషోత్తం రెడ్డి, రామ్మోహన్ రెడ్డి, ఎల్లప్ప, హనుమంతు రెడ్డి పాల్గొన్నారు.










