ప్రజాశక్తి- దేవనకొండ
ప్రజా సంక్షేమమే వైసిపి ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి గుమ్మనూరు జయరామ్ తెలిపారు. బుధవారం మండలంలోని తెర్నేకల్ గ్రామంలో 'గడపగడపకు మన ప్రభుత్వం' నిర్వహించారు. ముఖ్య అతిథులుగా మంత్రి జయరామ్, వైసిపి రాష్ట్ర కార్యదర్శి, శ్రీశైలం నియోజకవర్గ అబ్జర్వర్ సురేంద్ర రెడ్డి హాజరయ్యారు. ముందుగా రూ.80 లక్షలతో నిర్మించిన నూతన సచివాలయం-1, 2 భవనాలను ప్రారంభించారు. పొట్లపాడు గ్రామ రైతులకు శాశ్వత భూహక్కు పత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. నాలుగేళ్ల పాలనలో తెర్నేకల్ పంచాయతీ పరిధిలో ప్రభుత్వం మంజూరు చేసిన నిధులు రూ.24 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. తెల్లవంక వాగు డ్రెయినేజీ నిర్మాణానికి రూ.30 లక్షలు, గ్రామంలో తాగునీటి సమస్య నివారణకు రూ.15 లక్షలు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. సచివాలయ అధికారులు సేవా భావంతో పనిచేసి ప్రజల సమస్యలను పరిష్కరించాలని తెలిపారు. డీఎస్పీ శ్రీనివాసరెడ్డి, ఎంపిడిఒ గౌరీదేవి, తహశీల్దార్ వెంకటేష్ నాయక్, ఎఒ సురేష్ బాబు, ఎంఇఒ తిమ్మారెడ్డి, మంత్రి గుమ్మనూరు సోదరులు నారాయణస్వామి, శ్రీనివాసులు, ఎంపిపి లక్ష్మీదేవి, ఆమె భర్త లుమాంబ, జడ్‌పిటిసి కిట్టు, వైసిపి మండల కన్వీనర్ మల్లికార్జున, సర్పంచి అరుణ్ కుమార్, పొట్లపాడు సర్పంచి సోమశేఖర్ రెడ్డి, ఎంపిటిసి నామాల శ్రీనివాసులు, ఉప సర్పంచి భర్త బెల్ ఈరన్న, వైసిపి నాయకులు దివాకర్ నాయుడు, మోహన్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, హంపి రెడ్డి, నారాయణరెడ్డి, రాఘవేంద్ర, చాప వీరన్న, రామచంద్ర, పులి నరేష్, నాగన్న, ఏసేపు పాల్గొన్నారు.
భూ హక్కు పత్రాలను పంపిణీ చేస్తున్న మంత్రి గుమ్మనూరు










