ప్రజాశక్తి - దేవనకొండ
ప్రజా సంక్షేమమే వైసిపి ధ్యేయమని రాష్ట్ర ఉపాధి, కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరామ్ తెలిపారు. శనివారం మండలంలోని నేలతలమర్రి గ్రామంలో 'గడపగడపకు మన ప్రభుత్వం' నిర్వహించారు. ముందుగా గ్రామ సచివాలయాన్ని సందర్శించి సిబ్బంది పనితీరు పరిశీలించారు. గ్రామ ప్రజలకు అందుబాటులో ఉండి సేవలందించాలని సూచించారు. అనంతరం గ్రామంలో ఇంటింటికీ తిరిగి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వైసిపి ప్రభుత్వంలో పార్టీలకతీతంగా అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తోందని తెలిపారు. జడ్‌పిటిసి కిట్టు, ఎంపిపి లక్ష్మీదేవి భర్త లుమాంబా, వైసిపి మండల కన్వీనర్ మల్లికార్జున, వైసిపి నాయకులు దివాకర్ నాయుడు, నిజాలు రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, నారాయణరెడ్డి, రాజారెడ్డి, హనుమంతు రెడ్డి, సహదేవ, జయరాం, తెర్నేకల్ సర్పంచి అరుణ్ కుమార్, రామచంద్ర, కొత్తపేట బాబు పాల్గొన్నారు.
సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి గుమ్మనూరు జయరాం










