రొళ్ల : ప్రజల సమస్యలపై ప్రత్యేక దష్టి సారించాలని జాయింట్ కలెక్టర్ చేతన్ మండల అధికారులను ఆదేశించారు. ఆయన శుక్రవారం మండల పరిధిలో నాడు-నేడు కింద వివిధ పాఠశాలల్లో జరుగుతున్న పనులను పరిశీలించారు. ఇందులో భాగంగా హుట్టేబెట్ట, రత్నగిరి, అనుపమపల్లి, రొళ్ల, గొల్లహట్టి పాఠశాలల్లో పనుల పురోగతిపై చర్చించారు. అనంతరం మండలంలో అర్ధాంతరంగా ఆగిన రైతు భరోసా కేంద్రాలు, సచివాలయ భవన నిర్మాణాలపై ఆరా తీశారు. అలాగే సచివాలయం వెళ్లి సిబ్బంది హాజరు పట్టికను పరిశీలించి, ప్రజలకు అందిస్తున్న సంక్షేమ ఫలాలపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం మండల రెవెన్యూ కార్యాలయంలో పలు రికార్డులను తనిఖీ చేసి రీసర్వే పురోగతి, అసైన్డ్ భూములపై తహశీల్దార్ హసీనా సుల్తాన్‌తో చర్చించారు. జెసి వెంట ఎంఈఓ శ్రీధర్, ఆర్‌ఐ మంజునాథ్, సూపరింటెండెంట్ ఆరాధ్య, ఎస్సై వెంకటరమణ, పంచాయతీ కార్యదర్శి రచన, ఎమ్మార్పీఎస్ నాయకులు శ్రీనివాస్, తదితరులు ఉన్నారు.










