గోరంట్ల : 'గడప గడపకూ మన ప్రభుత్వం' కార్యక్రమంలో ప్రజలు అనేక సమస్యలపై అర్జీలు ఇచ్చారని, వాటిని త్వరితగతిన పరిష్కరించాలని ఎమ్మెల్యే శంకర నారాయణ అధికారులను ఆదేశించారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం ఎంపీపీ ప్రమీల అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జగనన్న కాలనీలో గహ నిర్మాణాలు వేగవంతంగా జరిగేలా హౌసింగ్ అధికారులు, ఇంజినీరింగ్ అసిస్టెంట్లు చర్యలు తీసుకోవాలన్నారు. మండలానికి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం, అగ్నిమాపక కేంద్రం, ఎక్సైజ్ స్టేషన్ మంజూరు చేయించాలని, పట్టణంలో రోడ్డు విస్తరణ పనులు చేపట్టాలని జడ్పిటిసి జయరాం నాయక్ ఎమ్మెల్యేను కోరారు. మండల వ్యవసాయ అధికారి మహబూబ్ బాషా మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్‌కు అవసరమైన విత్తన వేరుశనగ కోసం ప్రభుత్వానికి నివేదిక పంపమన్నారు. తహశీల్దార్ రంగనాయకులు మాట్లాడుతూ మండలంలో 3 జాతీయ రహదారులు మంజూరయ్యాయని, సిక్స్ లైన్ రహదారికి నగదు జమ చేయడానికి ప్రభుత్వం రైతుల నుంచి అకౌంట్లు తీసుకుందన్నారు. హిందూపురం-కదిరి రోడ్డు విస్తరణకు రైతులతో గ్రామ సభలు నిర్వహిస్తామన్నారు. భూ సర్వే పనులు చేయడానికి రెవెన్యూ సిబ్బంది గ్రామసభలు నిర్వహిస్తారని వారికి రైతులు సహకరించాలని కోరారు. సమావేశంలో ఎంపిడిఓ రఘునాథ్ గుప్తా, మండల అగ్రి ఛైర్మన్ రామకష్ణారెడ్డి, వైస్ ఎంపిపి నాగభూషణ్ రెడ్డి, అధికారులు, సర్పంచిలు, ఎంపిటిసి సభ్యులు పాల్గొన్నారు










