ప్రజాశక్తి - కౌతాళం
ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసమే 'గడపగడపకు మన ప్రభుత్వం' నిర్వహిస్తున్నట్లు మంత్రాలయం ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి తెలిపారు. మంగళవారం మండలంలోని హాల్వి గ్రామంలో ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ పథకాలు ఎలా అందుతున్నాయో, ఇంకా అందని వారు ఉన్నారా, ఏమైనా సమస్యలు ఉన్నాయా అని ప్రజలతో అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడారు. గ్రామస్థాయిలో ప్రతి ఇంటికీ ప్రభుత్వ సేవలు అందించడానికి వాలంటీరు, సచివాలయం, రైతు భరోసా కేంద్రం, ఆరోగ్య కేంద్రం వ్యవస్థలను తీసుకొచ్చినట్లు తెలిపారు. ప్రజలు కూడా ప్రభుత్వ సేవలను సద్వినియోగం చేసుకొని అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని కోరారు. వైసిపి రాష్ట్ర యువజన నాయకులు వై.ప్రదీప్ రెడ్డి, వైసిపి మండల కన్వీనర్ దేశాయి ప్రహ్లాద చారి, ఏకం రెడ్డి, రామన్న గౌడ్, చెన్నప్ప, బసవ ప్రభు, సర్పంచి క్రాంతి సిద్ధన్న గౌడ్, దర్గా సాధిక్, ఎంపిపి అమ్రేష్, వైస్ ఎంపిపి బుజ్జి స్వామి, అనిల్ కుమార్, చౌదరి బసవరాజ్, గోపాల్ రెడ్డి, భీమేష్ పాల్గొన్నారు.
పథకాలను వివరిస్తున్న ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి










