ప్రజాశక్తి - ఆదోని
ప్రజా సమస్యల పరిష్కారమే వైసిపి ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే వై.సాయిప్రసాద్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం పట్టణంలోనిహనుమాన్ నగర్‌లో రెండో రోజు 'గడపగడపకు మన ప్రభుత్వం' నిర్వహించారు. మున్సిపల్ ఛైర్మన్ బోయ శాంత, కౌన్సిలర్ లోకేశ్వరీ అధ్యక్షతన వార్డు ఇన్‌ఛార్జీ నాగరాజు ఆధ్వర్యంలో కార్యక్రమం సాగింది. ఇంటింటికీ వెళ్లిన ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డికి ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి వార్డులో ప్రతి గడపకూ తిరుగుతూ సమస్యలు తెలుసుకున్నారు. అనేకమంది స్వచ్ఛందంగా ముందుకొచ్చి పూలమాలలు, శాలువాలు కప్పి సన్మానించారు. హామీలను నెరవేర్చారని, తమకు అన్ని పనులు జరిగాయని పేర్కొంటూ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్యే మరింత రెట్టింపు ఉత్సాహంతో ముందుకు సాగుతూ ఇంకా ఏమైనా సమస్యలుంటే చెప్పాలని వాటిని కూడా పరిష్కరించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ... ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు నవరత్నాలతో పాటు ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అందించినట్లు తెలిపారు. చంద్రబాబు ఎన్ని కుట్రలు పన్నినా 2024 ఎన్నికల్లో ప్రజలు జగన్మోహన్ రెడ్డిని మళ్లీ ఆశీర్వదిస్తారని చెప్పారు. మార్కెట్ యార్డు ఛైర్మన్ మజర్ అహ్మద్, వైసిపి పట్టణ అధ్యక్షులు బి.దేవా, చంద్రకాంత్ రెడ్డి, డైరెక్టర్ రేణుక, మార్కెట్ యార్డు వైస్ ఛైర్మన్ కామాక్షి తిమ్మప్ప, మున్సిపల్ వైస్ ఛైర్మన్ నరసింహులు, కౌన్సిలర్లు బాలాజీ, రాజేశ్వర్ రెడ్డి, సురేష్, వార్డు ఇన్‌ఛార్జీ నాగరాజ్, కౌన్సిలర్ లోకేశ్వరి, సునార్ ఖాదర్, రామలింగేశ్వర, మాధవరెడ్డి, బికె.లక్ష్మన్న, శీనా, చిన్న ఈరన్న, మహిళలు జులేఖ, శ్రీలక్ష్మి, శ్రీదేవి, శంకర్, హరి పాల్గొన్నారు.
సమస్యలు తెలుసుకుంటున్న ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి










