Apr 06,2023 22:33

matladutunna perni nani

ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత బందరు శాసనసభ్యులు పేర్ని నాని
ప్రజాశక్తి-మచిలీపట్నం రూరల్‌

ప్రజా సమస్యల పరిష్కారానికి తాను నిరంతరం కృషిచేస్తున్నానని మాజీ మంత్రి, బందరు శాసనసభ్యులు పేర్ని వెంకట్రామయ్య (నాని) అన్నారు. బందరు మండలం పెదపట్నం పంచాయతీలో గురువారం జరిగిన రెవెన్యూ గ్రామ సభలో ఆయన ముఖ్యఅతిథిగా మాట్లాడారు. మచిలీపట్నం నియోజక వర్గం తీర ప్రాంతంలో అసైన్మెంట్‌, ప్రభుత్వ భూముల్లో వరి, ఆక్వా కల్చర్‌ సాగు చేసుకుంటున్నారన్నారు. ఎలాంటి చట్ట భద్రత కలిగిన పత్రాలు లేనందున గ్రామంలో గతంలో ప్రభుత్వం మంజూరు చేసిన లబ్ధిదారులు చనిపోయి ఉంటే వారి వారసులకు ఆ అసైన్మెంట్‌ పట్టా మంజూరు చేస్తారన్నారు. దీర్ఘకాలంగా ప్రభుత్వంలో సాగు చేసుకుని జీవనం కొనసాగిస్తుంటే వారికి హెక్టారులో లోపు భూమి ఉంటే వారికి ప్రభుత్వం పట్టా మంజూరు చేస్తుందన్నారు. ఇప్పటివరకు 65 మంది లబ్ధిదారులు పెట్టుకున్న అర్జీలను గ్రామ సభలో చదివి వినిపించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ గడిదేశి అనూష, ఎమ్మార్వో సునీల్‌ బాబు, కృష్ణా జిల్లా కోపరేటివ్‌ బ్యాంక్‌ డైరెక్టర్‌ బాల యేసు, మండల వ్యవసాయ సలహా మండల అధ్యక్షులు బాబు, ఎంపిడిఒ బాలకృష్ణ, వైసిపి కన్వీనర్లు, గృహసారధులు, గ్రామస్తులు, రైతులు, మహిళలు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు.