Oct 26,2023 19:39

ప్రచారజాతాలో మాట్లాడుతున్న రాధాకృష్ణ

ప్రజాశక్తి - ఆదోని
అసమానతలు లేని అభివృద్ధి కోసం ఈనెల 30న ఆదోని నుంచి చేపట్టే సిపిఎం 'ప్రజా రక్షణ భేరి' రాష్ట్ర బస్సుజాతాను జయప్రదం చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు పిఎస్‌.రాధాకృష్ణ, సీనియర్‌ నాయకులు ఈరన్న, మహానందరెడ్డి కోరారు. గురువారం ఆదోనిలోని కల్లుబావిలో ఆటో ప్రచార జాతాను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని చెప్పిన పాలక పార్టీలు ప్రజలను మోసం చేశాయని విమర్శించారు. జిల్లా నుంచి రాజకీయంగా అత్యున్నత పదవులు పొందినా జిల్లా అభివృద్ధికి చేసిందేమీ లేదని తెలిపారు. జిల్లాలో ఒక్క భారీ పరిశ్రమ కూడా లేదన్నారు. జిల్లా సాగునీరు, పారిశ్రామిక రంగం, విద్యలో వెనుకబాటు తనంతో ఉందని తెలిపారు. గత 75 ఏళ్లుగా దేశాన్ని, రాష్ట్రాన్ని పాలిస్తున్న పాలకులకు జిల్లా అభివృద్ధి పట్టడం లేదని విమర్శించారు. అసమానతలు లేని అభివృద్ధి కోసం, రాష్ట్రానికి ప్రత్యేక హోదా, వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ, యువతకు ఉపాధి, జిల్లా సమగ్రాభివృద్ధి కోసం నిధుల సాధనకు సిపిఎం ఆధ్వర్యంలో 30న రాష్ట్ర బస్సు జాతా ఆదోనిలో ప్రారంభమవుతుందని తెలిపారు. సిపిఎం పట్టణ కార్యదర్శి లక్ష్మన్న, కార్యదర్శి వర్గ సభ్యులు గోపాల్‌, ముక్కన్న, తిప్పన్న, పట్టణ కమిటీ సభ్యులు కృష్ణమూర్తి, నాగేంద్ర, నాగరాజు, వెంకటేష్‌, అజీమ్‌ ఖాన్‌, నాయకులు రాజు, ఈరన్న, మల్లయ్య, తిమ్మయ్య పాల్గొన్నారు. ఆదోని (రూరల్‌) మండలంలోని పెద్దతుంబలం గ్రామం నుంచి జీపు జాతాను ప్రారంభించారు. సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కె.వెంకటేశులు మాట్లాడుతూ... రాష్ట్రలో కరువు పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని జాతీయ విపత్తుగా ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. ఈ యాత్ర ప్రారంభ సభకు సిపిఎం పొలిట్‌ బ్యూరో సభ్యులు అశోక్‌ ధావలే, సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎంఏ.గఫూర్‌ హాజరవుతారని తెలిపారు. పెద్దతుంబలం, కుప్పగల్లు, బల్లేకల్లు, పాండవగల్లు, గనేకల్లు, జాలమంచి, దొడ్డనకేరి, కొత్తూరు, మాంత్రికి, సుల్తానాపురం, పెసలబండ, కపటి, నాగలాపురం, ఆరేకల్లు గ్రామాల్లో జీపుజాతా సాగింది. సిపిఎం మండల కార్యదర్శి లింగన్న, మండల కార్యదర్శి వర్గ సభ్యులు వీరారెడ్డి, ఎం.ఉచ్చీరప్ప, మండల కమిటీ సభ్యులు రామాంజనేయులు, శేఖర్‌ పాల్గొన్నారు. దేవనకొండ మండలం దేవనకొండ, పల్లెదొడ్డి, వెంకటాపురం, నేలతలమర్రి, గుండ్లకొండ, గుడిమిరాళ్ల, బంటుపల్లి, బేతపల్లి, పొట్లపాడు, కుంకునూరు గ్రామాల్లో ప్రచార జాతా సాగింది. మండలంలో సాగునీటి సమస్య పరిష్కారం కోసం, పంట కాలువల నిర్మాణం, కరువు, విద్యుత్‌ సమస్యల పరిష్కారం కోసం మండల కమిటీ ఆధ్వర్యంలో దేవనకొండ అంబేద్కర్‌ విగ్రహం దగ్గర ఆటో జాతాను సిపిఎం సీనియర్‌ నాయకులు బజారి జెండా ఊపి ప్రారంభించారు. మండల కమిటీ సభ్యుల అశోక్‌ అధ్యక్షత వహించారు. సిపిఎం జిల్లా నాయకులు బి.వీరశేఖర్‌, మండల నాయకులు సూరి, మహబూబ్‌ బాష మాట్లాడారు. సిపిఎం నాయకులు సుంకన్న, శ్రీనివాసులు, కౌలుట్ల స్వామి, నాగరాజు, వీరన్న, విజరు పాల్గొన్నారు. ఆస్పరిలో సిపిఎం ఆధ్వర్యంలో జీపుజాతాను సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గసభ్యులు రామాంజనేయులు, కెవి.నారాయణ ప్రారంభించారు. మండలంలోని శంకర బండ, చిరుమాన్‌ దొడ్డి, హలిగేరి, చిగిలి, నగరూరు, బిణిగేరి, తంగరడోణ, తురువగల్లు, తోగలగల్లు, దొడగొండ, బైలు పత్తికొండ, గార్లపెంట, డి.కోటకొండ, కారుమంచి, ములుగుందం, పలుకుర బండ గ్రామాల్లో జీపు జాతా సాగింది. సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు హనుమంతు, మండల నాయకులు బాలకృష్ణ, రంగస్వామి, ఎస్‌ఎఫ్‌ఐ మండల కార్యదర్శి రవి, సీనియర్‌ నాయకులు మాణిక్యప్ప, రంగప్ప, మధు రెడ్డి, చిన్న మల్లేష్‌, డివైఎఫ్‌ఐ నాయకులు మురళీ, నవీన్‌, సిపిఐ నాయకులు ఉరుకుందప్ప, ఉరుకుందు పాల్గొన్నారు. కోసిగి బస్టాండ్‌ దగ్గర సిపిఎం ఆటో జాతాను సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గసభ్యులు కె.వెంకటేశులు పారంభించారు. సిపిఎం మండల నాయకులు రాముడు, నాగేంద్ర, ముక్కరన్న, రాము, చిన్నా రెడ్డి పాల్గొన్నారు.

మాట్లాడుతున్న వెంకటేశులు
మాట్లాడుతున్న వెంకటేశులు