పుట్టపర్తి అర్బన్ : జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు వచ్చే వారికి అవసరమైన ప్రోత్సాహం అందించాలని కలెక్టర్ అరుణ్‌బాబు సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో జిల్లా పరిశ్రమలు, ఎగుమతి ప్రోత్సాహక కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పరిశ్రమల స్థాపనకు ముందుకు వచ్చే వారికి బ్యాంకర్లు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా స్టాండప్ ఇండియా పిఎంఇజిపి కింద ముందుకు వచ్చే వారికి రుణాలు ఇచ్చేలా చూడాలన్నారు. స్టాండ్ ఆప్ ఇండియా కింద ఎస్సీలకు 10 లక్షలు లోపు రుణాలు ఇవ్వాలన్నారు. స్టాండప్ ఇండియా, పిఎంఈజిఎ కింద రుణాలు ఇవ్వడం లేదని కమిటీ సభ్యులు సమావేశం దష్టికి తేగా వివరాలు అందిస్తే పరిశీలిస్తామని కలెక్టర్ తెలిపారు. ఏపీఐఐసీ భూముల్లో భూగర్భ జల శాఖ అనుమతి తీసుకున్న తర్వాతే బోర్లు వేయాలని సూచించారు. హిందూపురం పరిధిలోని గొల్లాపురం వద్ద ఉన్న ఫార్మా పరిశ్రమలు రీబోరు వేయకుండా చర్యలు తీసుకోవాలని అక్కడి తహశీల్దార్, ఆర్డీవోల సహకారం తీసుకొని ఆ పరిశ్రమను తనిఖీ చేపట్టాలన్నారు. సింగల్ డెస్క్ పార్టల్ పెండింగ్ కేసులను గడువులోగా పరిష్కరించాలన్నారు. అభివద్ధి పాలసీ 2022-23 క్రింద 2 క్లైములకు పెట్టుబడి సబ్సిడీని మంజూరు చేయాలని, బీసీ కేటగిరీ కింద 12 క్లైములకు పెట్టుబడి సబ్సిడీ మంజూరుకు కమిటీ ఆమోదం తెలిపింది. ఎస్సీ ఎస్టీ లబ్ధిదారులకు మూలధన పెట్టుబడి సబ్సిడీ మంజూరుకు చర్యలు చేపట్టాలన్నారు. సులభతర వాణిజ్య విధానం కింద వివిధ శాఖల నుంచి 217 మంది అనుమతులు పొందారన్నారు. లబ్ధిదారులకు కేంద్ర ప్రభుత్వం నిర్వహించే ఫీడ్ బ్యాక్ విషయమై అవగాహన కల్పించాలన్నారు. అందుకు ఆయా శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో పరిశ్రమల శాఖ జనరల్ మేనేజరు చాంద్‌బాషా, పర్యావరణ అధికారి శంకరరావు, విద్యుత్ శాఖ డీఈ మెసేస్, ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ మురళీమోహన్, లీడ్ బ్యాంకు జిల్లా మేనేజరు రమణ కుమార్, ఏపీ రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ మేనేజర్ వెంకట మహేష్, లేబర్ అసిస్టెంట్ కమిషనర్ రఘు రాములు, జిల్లా ఫైర్ అధికారి శంకర ప్రసాద్, ఛాంబర్ ఆఫ్ కామర్స్ జిల్లా కోఆర్డినేటర్ వెంకటరమణ, ఎస్సీ ఎస్టీ పరిశ్రమల జిల్లా కోఆర్డినేటర్ ప్రసాద్, ఆహుడ వైస్ ఛైర్మన్ మురళీకష్ణ గౌడ్, పాల్గొన్నారు.










