Aug 05,2023 19:20

మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేస్తున్న సిఆర్‌పి

ప్రజాశక్తి - కోసిగి
పాఠశాల పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కందుకూరు కాంప్లెక్స్‌ సిఆర్‌పి జి.యోహాను తెలిపారు. శనివారం ఎంఇఒ-1 మైనుద్దీన్‌, ఎంఇఒ-2 నాగేశప్ప ఆదేశాల మేరకు మండలంలోని దేవరబెట్ట, తుమ్మిగనూరు, సాతనూరు, ఎస్‌.కొట్టాల, సజ్జలగూడెం మండల పరిషత్‌ పాఠశాలలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పాఠశాల ఆవరణలో తరగతి, వంట గదులు, మరుగుదొడ్లు, పాఠశాల ఆవరణాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ప్రస్తుతం వర్షాకాలం కావడంతో పాఠశాల ఆవరణంలో విష పురుగులు చేరే ప్రమాదం ఉందన్నారు. దృష్టిలో ఉంచుకొని పాఠశాలలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. అనంతరం మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేశారు. ప్రధానోపాధ్యాయులు ప్రసాద్‌, అరుణ్‌ కుమార్‌, అంజమ్‌ బేగం, సుబ్రమణ్యం, రాజ్‌కుమార్‌ పాల్గొన్నారు.