Apr 05,2023 22:44

deo tahera sultana

పరీక్షా కేంద్రాలకు ఉపాధ్యాయులు ఫోన్లు తేవొద్దు
జిల్లా విద్యాశాఖాధికారి తాహెర సుల్తానా
ప్రజాశక్తి-కలెక్టరేట్‌ (కృష్ణా)
పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల విధులకు హాజరయ్యే ఉపాధ్యాయులంతా విద్యాశాఖ సూచించిన జాగ్రత్తలు తప్పని సరిగా పాటించాలని జిల్లా విద్య శాఖాధికారి తాహెర సుల్తానాకోరారు. పరీక్ష కేంద్రాలన్నీ నో మొబైల్‌ జోన్‌ గా ప్రకటించామనీ పేర్కొన్నారు. పరీక్ష విధుల్లో పాల్గొనే సిబ్బంది అంతా తమ మొబైల్‌ ఫోన్‌ ఇంట్లోనే ఉంచి రావాలన్నారు. పోలీస్‌ పికెటింగ్‌ వద్ద మొబైల్‌ అప్పగించాలన్నారు. పరీక్ష కేంద్రాల్లోని విద్యార్థులు, విధుల్లో ఉన్న సిబ్బంది ఎలాంటి ఎలక్ట్రానిక్స్‌ పరికరాలు పరీక్ష కేంద్రాల్లోకి తీసుకురాకూడదన్నారు. ఒకసారి పరీక్ష కేంద్రంలోకి వచ్చిన సిబ్బంది, ముగిసేవరకు ఎలాంటి పరిస్థితుల్లోనూ బయటకి రాకూడదన్నారు.