Sep 08,2023 19:58

పీఠాధిపతులు శ్రీసుభుదేంధ్రతీర్థులును కలిసిన జర్నలిస్టులు

ప్రజాశక్తి - మంత్రాలయం
పాత్రికేయులకు అవసరమైన ప్రెస్‌క్లబ్‌ ఏర్పాటుకు సహకరిస్తామని శ్రీమఠం పీఠాధిపతులు శ్రీసుభుదేంధ్రతీర్థులు తెలిపారు. శుక్రవారం ఎపిడబ్ల్యుజె నూతన కమిటీ ఆధ్వర్యంలో పీఠాధిపతులును కలిసి ప్రెస్‌ క్లబ్‌ గురించి ప్రస్తావించారు. ఈ సందర్భంగా ఎపిడబ్ల్యుజె నియోజకవర్గ నూతన అధ్యక్షులు జయరాజు, ప్రధాన కార్యదర్శి హుస్సేని, ఆర్గనైజింగ్‌ సెక్రటరీ సూర్య నారాయణ, కోశాధికారి సాబువలీ ఆధ్వర్యంలో పీఠాధిపతులుకు శాలువా, పూలమాల వేసి నమస్కరించుకున్నారు. పీఠాధిపతులు కూడా జయరాజును పూలమాలతో అభినందించి ఫల మంత్రాక్షతలు అందజేసి ఆశీర్వదించారు. ప్రెస్‌ క్లబ్‌ విషయంలో స్థల పరిశీలన జరుగుతోందని, త్వరలోనే స్థలాన్ని నిర్ణయించి నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు.
పీఠాధిపతుల నిర్ణయమే శిరోధార్యం
- మేనేజర్‌ శ్రీనివాసరావు

శ్రీమఠం పీఠాధిపతులు శ్రీసుభుదేంధ్రతీర్థులు నిర్ణయమే శిరోధార్యమని మేనేజర్‌ ఎస్‌కె.శ్రీనివాసరావు తెలిపారు. ఎపిడబ్ల్యుజె నూతన కమిటీ ఆధ్వర్యంలో పరిపాలన కార్యాలయంలో ఆయనను కలిసిన సందర్భంగా ఆయన మాట్లాడారు. పాత్రికేయులకు సహాయ, సహకారాలు అందించాలని మేనేజర్‌ను కోరగా ఆయన పైవిధంగా స్పందించారు. ఏ విషయమైనా పీఠాధిపతులతో చర్చించి హామీ ఇస్తామని తెలిపారు.