కదిరి టౌన్ : ప్రేమ అనురాగాలకు ప్రతీక రంజాన్ అనిటిడిపి నియోజవర్గ ఇన్‌ఛార్జి కందికుంట వెంకట ప్రసాద్ పేర్కొన్నారు. రంజాన్ మాసం పురస్కరించుకొని ఉపవాస దీక్షలు చేస్తున్న ముస్లిం సోదరులకు కదిరి పట్టణంలోని వలిసాబ్ రోడ్‌లో కందికుంట అధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఇచ్చారు. అంతకుముందు ముస్లిం సోదరులతో కలిసి కందికుంట ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా కందికుంట మాట్లాడుతూ రంజాన్ విశిష్టత గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో మౌలానా సముల్లా, మౌలానా ఫయాజ్, మౌలానా శన్వస్, తెలుగు యువత హిందూపూర్ పార్లమెంటు అధ్యక్షులు బాబ్జాన్, టిడిపి పట్టణ అధ్యక్షులు డైమండ్ ఇర్ఫాన్, కౌన్సిలర్ ముస్తఫా, మాజీ కౌన్సిలర్ ఖాదర్ బాషా తదితరులు పాల్గొన్నారు.
పెనుకొండ :రంజాన్ మాసం సందర్భంగా తెలుగుదేశం పార్టీ ముస్లిం మైనారిటీ సోదరులు పట్టణంలోని షాదీ మహల్ లో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో టిడిపి జిల్లా అధ్యక్షులు బికె. పార్థసారథి , జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ మహమ్మద్ గౌస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ పవిత్రమైన రంజాన్ నెలలో ముస్లిం సోదరులతో కలిసి (ఇఫ్తార్ లో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు,తదితరులు పాల్గొన్నారు.










