Oct 15,2023 23:49

సన్మానం అందుకుంటున్న అతిథులు

ప్రజాశక్తి-ఒంగోలు : కెమెరామెన్‌ మీడియా అసోసియేషన్‌ హాలులో విశ్వబ్రాహ్మణ సంఘం జిల్లా అధ్యక్షుడు చెన్నుపల్లి శ్రీనివాసచారి అధ్యక్షతన పథకంపై ఆదివారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా విశ్రాంత డిప్యూటీ మేనేజర్‌ సామంతపూడి సుబ్బారావు మాట్లాడుతూ సాంప్రదాయ చేతికులవత్తి దారులను అదుకోవడమే ప్రధానమంత్రి విశ్వకర్మ కౌశల్‌ యోజన పథకం యొక్క ముఖ్యఉద్దేశ్యమని తెలిపారు. చేతి వత్తుదారులందరూ పారిశ్రావివేత్తలకు ఎదగడానికి అర్హులైన వారు బ్యాంకు సహకారం తీసుకోవాలన్నారు. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఒంగోలు ఆర్‌బిఒ అసోసియేట్‌ నూతలపాటి రాజేష్‌ మాట్లాడుతూ పరిశ్రమలు స్థాపించే యువతీ, యువకుల్లో అర్హులకు స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా రుణాలు అందజేస్తున్నట్లు తెలిపారు. అనంతరం వీడియో అండ్‌ కెమెరామెన్‌ ఒంగోలు అసోసియేషన్‌ అధ్యక్షుడు ఏల్పూరి నాగేశ్వరరావు, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఒంగోలు ఆర్‌బిఒ కార్యాలయం ఆఫీసర్‌. నూతలపాటి రాజేష్‌, విశ్రాంత డిప్యూటీ మేనేజర్‌ సామంతపూడి సుబ్బారావు వారి సతీమని రమాదేవిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు పట్టణ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఫణిదపు సుధాకర్‌, ఏల్చూరి హేమంత్‌ కుమార్‌, రాష్ట్ర కార్యదర్శి పొన్నపల్లి బ్రహ్మానందం, విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ గోనుగుంట రజిని, నూతలపాటి పోతులూరి ఆచారి , కోశాధికారి దక్షిణామూర్తి, ప్రజాశక్తి బ్యూరో సామంతపూడి బ్రహ్మం, నూతలపాటి హరిబాబు, మోతుకూరు నాగేశ్వరరావు, దిలీప్‌, కుందుర్తి నాగ ఆంజనేయులు, వినుకొండ సుబ్బయ్య, అనంత మాధవ్‌, కలిచేటి నాగ బ్రహ్మచారి తదితరులు పాల్గొన్నారు.