హిందూపురం : రాష్ట్రంలో ఉన్న 13 లక్షల మంది ఉద్యోగ, ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్లను ఆర్థికంగా అనేక ఇబ్బందులకు గురి చేస్తున్న ఈ ప్రభుత్వంపై తిరుగుబాటు చేయడానికి అందరు సిద్ధం కావాలని ఎస్టీయు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హెచ్. తిమ్మన్న పిలుపునిచ్చారు. శుక్రవారం పట్టణంలోని మేళాపురంలోని ప్రాథమికోన్నత పాఠశాలలో ఆసంఘం జిల్లా అధ్యక్షులు రామమోహన్ అద్యక్షతన జిల్లా సమావేశం జరిగింది. ముఖ్య అథితిగా పాల్గొన్న తిమ్మన్న మాట్లాడుతు ఉద్యోగులు, ఉపాధ్యాయులు ప్రతినెల 1వ తేదీ వేతనాల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఆంధ్రలో ఉందన్నారు. ఉద్యోగుల 11వ పిఆర్సి బకాయిలు, కరువు భత్యం బకాయిలు దాదాపు రూ.3 వేల కోట్లు తక్షణం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.ఉపాద్యాయులు ఎదుర్కోంటున్న సమస్యలపై పెద్ద ఎత్తున ఆందోళనలకు సిద్దం కావాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులు, రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి నాగరాజు, రాష్ట్ర ఆర్థిక కమిటీ సభ్యులు బియన్. ప్రసాద్, అనంతపురం జిల్లా అధ్యక్షులు జి. సూర్యుడు, సీనియర్ నాయకులు జి .గోవిందు, తిప్పన్న, వినోద్‌తో పాటు అన్ని మండల, మున్సిపల్ శాఖల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.










