Sep 08,2023 19:48

కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్న ఎఒ సురేష్‌ బాబు

ప్రజాశక్తి - దేవనకొండ
గత రెండు రోజుల క్రితం అప్పుల బాధతో మృతి చెందిన కౌలు రైతు చిగిలి నరసప్ప కుటుంబాన్ని ఎఒ సురేష్‌ బాబు శుక్రవారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఆత్మహత్య నివేదిక వివరాలను సంబంధిత ఉన్నతాధికారులకు పంపినట్లు తెలిపారు. ప్రభుత్వ సహాయం మంజూరయ్యేలా కృషి చేస్తామని భరోసా ఇచ్చారు. విఆర్‌ఒ జాకీర్‌ హుస్సేన్‌, ఎఇఒలు జయరామ్‌, రంగన్న పాల్గొన్నారు.