Aug 16,2023 22:55

ప్రజాశక్తి కలక్టరేట్‌ (కష్ణా) : జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రులలో ఆరోగ్యశ్రీ సేవలు పెంచాలని,మాతా శిశు మరణాలను తగ్గించేందుకు సమన్వయంతో పని చేయాలని జిల్లా కలెక్టర్‌ పి. రాజాబాబు వైద్యాధికారులను ఆదేశించారు. బుధవారం నగరంలోని కలెక్టరేట్‌ స్పందన సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్‌ వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో సమావేశం నిర్వహించి ఆరోగ్యశ్రీ సేవలు, మాతా శిశు మరణాలు, తదితర అంశాలపై సమీక్షిం చారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వైద్య రంగానికి పెద్ద పీట వేసి వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోందన్నారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు మరింత పెరగాలన్నారు. వైద్యవత్తి ఎంతో పవిత్రమైనదని ప్రతి ఒక్కరూ బాధ్యతగా విధులు నిర్వర్తించాలన్నారు. గర్భవతులు, చిన్నారుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించి మాతా శిశు మరణాలు జరగకుండా నివారణ చర్యలు గట్టిగా చేపట్టాలన్నారు. ఇటీవల ఇద్దరూ గర్భవతులు ప్రైవేట్‌ ఆస్పత్రిలో ఆరోగ్య పరీక్షలు చికిత్స పొందుతూ చివరి నిమిషంలో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి మరణించడం జరిగిందన్నారు. ఇటువంటివి పునరావతం కాకుండా అన్ని ప్రైవేట్‌ ఆసుపత్రులను తనిఖీ చేయాలని, ఎవరైనా గర్భవతులు అక్కడ చేరి ఉంటే ఆ ఆస్పత్రులలో హై రిస్క్‌ ప్రసవాలకు సంబంధించి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారా లేదా అన్ని వసతులు, పరికరాలు ఉన్నాయా లేదా పరిశీలిం చాలన్నారు. అవి ఉంటేనే ప్రైవేట్‌ ఆస్పత్రులలో ఉండేలా చూడాలని లేకుంటే ప్రైవేట్‌ ఆసుపత్రులలో చేర్చుకో కుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో డిఎంహెచ్వో డాక్టర్‌ గీతాబాయి, డిసిహెచ్‌ఎస్‌ మచిలీపట్నం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి మెడికల్‌ సూపర్నెంట్‌ సూపర్డెంట్‌ పర్యవేక్షకులు డాక్టర్‌ రమేష్‌ కుమార్‌ పాల్గొన్నారు.