ప్రజాశక్తి - ఆదోని
ప్రాథమిక విద్యా వ్యవస్థను యథాతధంగా కొనసాగించాలని యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎన్.నాగమణి, జిల్లా అధ్యక్షులు జె.ఎల్లప్ప డిమాండ్ చేశారు. సోమవారం ఆదోనిలో ప్రజా రక్షణ భేరి బస్సు యాత్ర ప్రారంభ కార్యక్రమానికి వచ్చిన సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు అశోక్ ధావలే, సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎంఎ.గఫూర్‌కు యుటిఎఫ్ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. జిఒ 117 ద్వారా రాష్ట్రంలోని ప్రాథమిక విద్యావ్యవస్థను ఛిన్నాభిన్నం చేశారన్నారు. పేద, బడుగు, బలహీన వర్గాలకు విద్య అందాలంటే ప్రాథమిక పాఠశాలలను యథావిధిగా కొనసాగించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు సిపిఎస్‌ను రద్దు చేసి పాతపెన్షన్ విధానాన్ని అమలు చేయాలని కోరారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 25 వేల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయకపోవడం వల్ల ప్రస్తుతం పనిచేస్తున్న ఉపాధ్యాయులపై పనిభారం ఎక్కువగా ఉందని పేర్కొన్నారు. యుటిఎఫ్ జిల్లా కార్యదర్శులు దావీదు, గాదెలింగప్ప, నరసింహులు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు మల్లారి నాగరాజు, జిల్లా ఆడిట్ కమిటీ సభ్యులు కౌలన్న, శ్రీనివాసులు, మల్లికార్జున, సీనియర్ నాయకులు కృష్ణమూర్తి, రాఘవేంద్ర, నరసయ్య గౌడ్, జి.బాబు, కె.నాగరాజు, మండలాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వై.రామాంజనేయులు, రంగన్న, చంద్రపాల్, శంకరయ్య, సుధాకర్, భాస్కర్ పాల్గొన్నారు.
వినతిపత్రం ఇస్తున్న నాయకులు










