Nov 14,2023 16:19

ప్రజాశక్తి - చాట్రాయి
   జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు మంగళవారం చాట్రాయి గ్రంథాలయ శాఖలో ప్రారంభించారు. ముందుగా జవహర్‌లాల్‌ నెహ్రూ జన్మదినాన్ని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి లైబ్రేరియన్‌ మణికంఠ, జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు కృష్ణయ్య పూలమాలతో ఘనంగా నివాళులర్పించారు. అనంతరం విద్యార్థులకు గ్రంథాలయ పుస్తక ప్రాముఖ్యతను, నెహ్రూ జీవిత చరిత్రను వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల సైన్స్‌ మాస్టర్‌ చంటిబాబు, పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు.