Mar 16,2023 22:40

nivali arpistunna collector p.ranjitbasha

పొట్టి శ్రీరాములుకు ఘన నివాళి
ప్రజాశక్తి-యంత్రాంగం
అమరజీవి పొట్టి శ్రీరాములు 122వ జయంతి వేడుకలు జిల్లాలోని పలు ప్రాంతాల్లో గురువారం జరిగాయి. కలెక్టరేట్‌ (కృష్ణా) : తెలుగు మాట్లాడేవారంతా ఐక్యంగా ఉండాలనే సంకల్పంతో పొట్టి శ్రీరాములు సత్యాగ్రహం చేసి ప్రాణత్యాగం చేసిన మహనీయుడని జిల్లా కలెక్టర్‌ రంజిత్‌ బాషా కొనియాడారు. అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతిని పురస్కరించుకొని గురువారం కలెక్టరేట్‌ స్పందన మీటింగ్‌ హాల్లో జిల్లా కలెక్టర్‌ పి.రంజిత్‌ బాషా, జాయింట్‌ కలెక్టర్‌ డా. అపరాజిత సింగ్‌ డిఆర్వో వెంకటేశ్వర్లు తదితర అధికారులతో కలసి కలెక్టర్‌ పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. చల్లపల్లి : చల్లపల్లి గ్రామ పంచాయతీలో సర్పంచ్‌ పైడిపాముల కృష్ణకుమారి నివాళులర్పించారు. కార్యదర్శి పి.సుకుమార్‌, వార్డు సభ్యురాలు ఉప్పల వెంకటేశ్వరమ్మ, జూనియర్‌ అసిస్టెంట్‌ ఎం.సంధ్య, సిబ్బంది, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో నాయకులు అన్నవరపు పాండురంగారావు నివాళులర్పించారు. పెదపారుపూడి : మండల ప్రజాపరిషత్‌ కార్యాలయంలో ఎంపీడీవో డి సీతామహాలక్ష్మి, యుపిఆర్డి ఎం నాగిరెడ్డి, ఏవో రమణారావు పంచాయతీ కార్యదర్శులు బి సాగర్‌ రాణి, సిహెచ్‌ ఆంజనేయులు నివాళులర్పించారు. పెదపారుపూడి సచివాలయంలో ఇఒపిఆర్‌డి ఎం.నాగిరెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పంచాయతీ కార్యదర్శి సిహెచ్‌ ఆంజనేయులు, సచివాలయ మహిళా పోలీస్‌ ఉప్పలపాటి నాగలక్ష్మి విజరు భూషణం, దోసపాడులో పంచాయతీ కార్యదర్శి సాగర్‌ రాణి, సిహెచ్‌ శ్రీనివాసరావు, చిన్నపారుపూడి సచివాలయంలో నరేష్‌ పెదపారుపూడి పోలీస్స్టేషన్లో ఎస్‌ఐ పి నాగ కళ్యాణి అప్పారావు, కనకారావు, ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు దొండపాడు రాంబాబు నివాళులర్పించారు. గన్నవరం (ఉంగుటూరు) : మండల పరిషత్‌ కార్యాలయంలో ఎంపిపి వి.సరోజినీ, ఎంపిడిఒ జి.ఎస్‌.వి శేషగిరిరావు, ఇ.ఓ (పి.ఆర్‌ అండ్‌ ఆర్‌.డి) ఎం.అమీర్‌ బాష నివాళులర్పించారు. గుడ్లవల్లేరు : వాసవి క్లబ్‌ గుడ్లవల్లేరు ఆధ్వర్యంలో డాక్టర్‌ కొల్లిపర సత్యనారాయణ సహకారంతో చలివేంద్రాన్ని గురువారం స్థానిక సెంటర్లోని కామదేను ఆటోమొబైల్‌ షాప్‌లో ఏర్పాటు చేశారు. వాసవి క్లబ్‌ ప్రాంతీయ అధికారి అవగాహన పర్యటన కార్యక్రమంలో భాగంగా ముప్పిడి గంగాధర వెంకట విశ్వేశ్వర గుప్తా జయప్రద దంపతుల సహకారంతో 130 మంది నిరుపేదలకు అన్నదానం చేశారు. బొడ్డు హెర్నియా తో బాధపడుతున్న వ్యక్తి కుటుంబానికి రూ.30 వేలు ఆపరేషన్‌ నిమిత్తం డాక్టర్‌ సత్యనారాయణ అందజేశారు. ప్రతినెలా పెన్షన్‌ నిమిత్తం ఐదుగురికి రూ.200 చొప్పున అందజేశారు. ఈ కార్యక్రమంలో రీజనల్‌ చైర్మన్‌ చిట్టూరి శ్రీనివాసరావు, గాదే మోహన్‌ బాబు, బొచ్చు నాగ వెంకట సుదర్శన్‌, మండల వాసవీ క్లబ్‌ అధ్యక్షులు కొల్లిపర అనసూయ, చిట్టూరి కామేశ్వరి, తదితరులు పాల్గొన్నారు. గన్నవరం : మండల ప్రజా పరిషత్‌లో ఎంపీపీ అనగాని రవి, ఎంపీడీవో ఇన్చార్జ్‌ జె ఎస్‌ ఆర్‌ కే ప్రసాద్‌, ఎం. పి టి సి సభ్యులు పడమటి రంగారావు నివాళులర్పించారు. ఘంటసాల : శ్రీకాకుళం గ్రంథాలయంలో అధికారిణి దారా సుజాత, అంగన్‌ వాడీ టీచర్‌ ఏ.కనక దుర్గ, పాఠశాల ఉపాధ్యాయురాలు మల్లీశ్వరి, విద్యార్థులు పాల్గొన్నారు. అవనిగడ్డ : వైసిపి కార్యాలయం వద్ద రైతు విభాగం జోనల్‌ అధ్యక్షులు కడవకొల్లు నరసింహారావు, పోలీస్‌ స్టేషన్‌ వద్ద ఎంపీపీ తుంగల సుమతి దేవి, జెడ్పీటీసీ చింతలపూడి లక్ష్మీనారాయణ, సర్పంచ్‌ గోరుముచ్చు ఉమా, ఉపసర్పంచ్‌ కోడూరు సత్యనారాయణ, వైఎస్‌ఆర్సిపి ట్రెడ్‌ యూనియన్‌ నాయకులు గార్లపాటి గోపి, అవుట్‌ సోర్సింగ్‌ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ మద్ది చిన్న, కొనకళ్ళ రామ్మోహనరావు, విసంశెట్టి నవీన్‌, కోడూరు శ్రీనివాస్‌, పవన్‌, ఆర్యవైశ్య నాయకులు పాల్గొన్నారు. టిడిపి కార్యాలయం వద్ద నాయకులు కొల్లూరి వెంకటేశ్వరరావు, ఘంటసాల రాజమోహనరావు నివాళులర్పించారు. బండే రాఘవ, బచ్చు రఘునాథ్‌, గుంటూరు వినరువర్మ, శ్రీనివాసరావు, మాచవరపు ఆదినారాయణ, షేక్‌ బాబావలి, మొగల్‌ మురాద్‌, పుల్లగోరు రాజేంద్రరావు, యలవర్తి ఆది, మెగావత్‌ గోపి, చెన్ను గాంధీ, కోట సాయి పాల్గొన్నారు. మండల పరిషత్‌ కార్యాలయం వద్ద ఎంపీపీ తుంగల సుమతిదేవి జడ్పిటిసి చింతలపూడి లక్ష్మీనారాయణ, ఇన్చార్జ్‌ ఎంపీడీవో పి శైలజ కుమారి, సూపరింటెండెంట్‌ అతావుల్లా సిబ్బంది పాల్గొన్నారు. డిఎస్పీ కార్యాలయం వద్ద డిఎస్పి మహబూబ్‌ బాషా నివాళులర్పించారు. సిఐ జి.శ్రీనివాస్‌, సిబ్బంది పాల్గొన్నారు.