బొర్రా గుహలు కిటకిట
xప్రజాశక్తి- అనంతగిరి: అనంతగిరిలో ప్రముఖ పర్యాటక కేంద్రాలకు వేలాదిమంది పర్యాటకులు పోటెత్తారు. వరుసగా మూడు రోజులు సెలవులు కావడంతో ఉద్యోగులు కుటుంబాలతో తరలి వచ్చారు. అనంతగిరి, బొర్రా గుహలు, కటికి, తాడిగుడ జలపాతాలతో పాటు డమ్ముకు, సుంకరమట యు పాయింట్, అనంతగిరి కాఫీ ప్లాంటేషన్ తదితర ప్రాంతాలు కిటకిట లాడాయి. కుటుంబ సమేతంగా ఆనందంగా గడిపారు. బొర్రా గుహల ఏర్పడిన విధానంపై గాడ్స్, సిబ్బందిని పర్యాటకులు అడిగి తెలుసుకున్నారు. ట్రాఫిక్ అంతరాయంతో వాహనదారులు అవస్థలు పడ్డారు.










