Oct 16,2023 00:40

తాడిగూడ వద్ద పర్యాటకుల సందడి

ప్రజాశక్తి-అనంతగిరి: అల్లురి జిల్లా ఏజెన్సీ ప్రముఖ పర్యాటక ప్రాంతంలో ఆదివారం పర్యాటకులు పోటెత్తారు. దసరా సెలవులు కావడంతో విదేశీ, ఇతర ప్రాంతాలకు చెందిన వేలాది మంది పర్యాటకులు తరలి వచ్చారు. మండలంలోని ఉన్న బొర్రా గుహలు జనాలతో కిటకిటలాడింది. కటికి, తాడిగుడ, యూపైంట్‌ లతో పాటు జలపాతాలు తిలకిస్తూ అనంతగిరి, చాపరాయి, కాపీ ప్లాంటేషన్‌, సుంకరమెట్ట యు పాయింట్‌ ప్రాంతాలు జనాలతో కిటకిట లాడాయి. కుటుంబ సభ్యుల సమేతంతో ఘాట్‌రోడ్డు, ప్రముఖ పర్యాటక కేంద్రాలలో సెల్పులు దిగుతూ సందడి చేస్తూ ఆనందంగా గడపారు.