ప్రజాశక్తి - ఆస్పరి
మండలంలోని బిల్లేకలు పంచాయతీ ఆవరణంలో నిర్వహించిన కూరగాయల మార్కెట్ వేలంపాటలు రసవత్తరంగా సాగాయి. సోమవారం పత్తికొండ డిఎల్‌పిఒ ప్రకాష్ నాయుడు ఆధ్వర్యంలో మార్కెట్ వేలం పాటలు నిర్వహించారు. సర్పంచి శ్రీనివాసులు అధ్యక్షతన వేలంపాట ప్రారంభించారు. ఈ వేలం పాటలో 8 మంది పాటదారులు పాల్గొన్నారు. పోటాపోటీగా సాగిన వేలంపాటలో గిత్త నల్లన్న రూ.58,50,750లకు పాటను దక్కించుకున్నారు. గతేడాది కంటే ఈఏడాది రూ.4,12,750 పంచాయతీకి ఆదాయం వచ్చిందని డిఎల్‌పిఒ ప్రకాష్ నాయుడు తెలిపారు. ఇఒఆర్‌డి నరసింహా రెడ్డి, పంచాయతీ కార్యదర్శులు లక్ష్మన్న, సునీల్ కుమార్, వైసిపి మండల కన్వీనర్ పెద్దయ్య, మాజీ ఎంపిటిసి వెంకటేష్, మాజీ సొసైటీ డైరెక్టర్ కృష్ణ, నాయకులు హనుమంతు రెడ్డి, తిమ్మన్న, మహేష్, వీరేష్, రఘు పాల్గొన్నారు.
వేలం పాటలో పాల్గొన్న పత్తికొండ డిఎల్‌పిఒ ప్రకాష్ నాయుడు










