Sep 22,2023 00:26

ఫోటో : మాట్లాడుతున్న ఎం పి డి ఓ ఎల్‌ పూర్ణయ్య ,2 ర్యాలీ చేస్తున్న సిబ్బంది

ప్రజాశక్తి-పెదబయలురూరల్‌: మండలం కేంద్రంలో శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్ట్‌ అధికారి ఎం. రాజేశ్వరి ఆధ్వర్యంలో పోషణ మహౌత్సవ వేడుకలు గురువారం నిర్వహించారు. ఎంపిడిఓ ఎల్‌.పూర్ణయ్య, ఎంపిపి బి.వరహలమ్మ, వైస్‌ ఎంపి పి కొర్రా రాజు బాబులు ఐసిడిఎస్‌ ద్వారా అందిస్తున్న పోషక ఆహారం వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్‌ సింహాచలం, రాజేశ్వరి, అంగనివాడి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.