Sep 30,2023 21:37

  భీమడోలు:శుభ్రతతో తయారు చేసిన పోషక విలువలు గల వంటకాలను తీసుకోవడం ద్వారా విద్యార్థులు ఆరోగ్య వంతులుగా కొనసాగవచ్చని శ్రీచైతన్య పాఠశాల ప్రిన్సిపల్‌ డి.సోహిని తెలిపారు. పాఠశాలలో ప్రతినెలా నిర్వహించే స్మార్ట్‌ లివింగ్‌ కార్యక్రమంలో భాగంగా సెప్టెంబర్‌ నెలకు గాను సాంప్రదాయ విలువలతో కూడిన వంటకాల తయారీపై విద్యార్థులకు అవగాహనా కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జీవశాస్త్రం పాఠశాల ఒఎస్‌డి కె.రామకృష్ణ, అకడమిక్‌ డీన్‌ వి.భార్గవ కిరణ్‌, ఎఒ ముఖేష్‌, ఆర్‌ఐ పార్థసారథి, అకడమిక్‌ కోఆర్డినేటర్‌ ఉదయ భాస్కర్‌ పాల్గొన్నారు.