పోషక విలువలతో ఆహారం అందించటమే లక్ష్యం
గోరుముద్ద పథకం ప్రారంభంలో కలెక్టర్ పి.రంజిత్‌భాష
ప్రజాశక్తి-కలెక్టరేట్ (కృష్ణా)
సరైన పోషకాలు లభించినప్పుడు పిల్లల్లో మానసిక ఎదుగుదలతో పాటు జ్ఞాపకశక్తి పెంపొంది బాగా చదవడానికి దోహదం చేస్తుందని జిల్లా కలెక్టర్ పి.రంజిత్‌భాష పేర్కొన్నారు. మంగళవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుండి జగనన్న గోరుముద్ద పథకంలో భాగంగా పాఠశాల విద్యార్థులకు రాగిజావ అందించే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించగా, ఈ కార్యక్రమానికి కలెక్టరేట్ వీడియోకాన్ఫరెన్స్ హాలు నుండి జిల్లా కలెక్టర్, జడ్పీ చైర్ పర్సన్ ఉప్పాల హారిక, ఆర్టీసీ రీజనల్ చైర్ పర్సన్ తాతినేని పద్మావతి, నగర మేయర్ మోకా వెంకటేశ్వరమ్మ, డిప్యూటీ మేయర్ తంటిపూడి కవిత పాల్గొని విద్యార్ధులకు రాగిజావ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జగనన్న గోరుముద్ద పథకంలో ప్రతి రోజూ పోషక విలువలతో కూడిన ఆహార పదార్థాలతో పాటు ఈ రోజు నుండి రాగిజావను కూడా చేరుస్తున్నట్లు తెలిపారు. ఐరన్, కాల్షియం వంటి పోషకాలు అందించుటకు రోజుకోరకమైన మెనూతో పోషక విలువలతో కూడిన మధ్యాహ్న భోజనం అందిస్తున్న విషయం గుర్తు చేశారు. జిల్లా వ్యాప్తంగా 1365 పాఠశాలల్లో 1,03,727 మంది విద్యార్ధులు లబ్ది పొందుతారన్నారు. ఈ కార్యక్రమంలో డీఈఓ తాహేరా సుల్తానా, ఐసీడీఎస్ పీడీ ఎస్. సువర్ణ, డిఎంఅండ్ హెచ్ డా.గీతాబాయి, డిఆర్ డిఏ పీడీ పిఎస్‌ఆర్.ప్రసాద్, ఎంఈఓ దుర్గాప్రసాద్, స్థానిక కార్పొరేటర్ సతీష్, వివిధ పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు.
కోడూరు : జగనన్న గోరుముద్దలో భాగంగా స్వతంత్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు రాగి జావ పంపిణీ కార్యక్రమాన్ని మంగళవారం మండల ఎంపీపీ కొండవీటి వెంకట కుమారి, జెడ్పీటీసీ వై వి సత్యనారాయణ, పిఎసిఎస్ అధ్యక్షులు పరిశే మాధవరావు,ఎంఈఓ టీవీ ఏం రామదాసు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో విద్యా కమిటీ చైర్మన్ గల్లా శ్రీనివాసరావు ,ఎంపీటీసీ సభ్యులు తిమ్మన వెంకట నాంచారయ్య, ఎంపీడీవో పాండురంగారావు ,కే నారాయణ రావు, పంచాయతీ కార్యదర్శి వై సుబ్రహ్మణ్యం, ప్రధానోపాధ్యాయులు,ఏవి రమణ ,ఉపాధ్యాయులు పాల్గొన్నారు. గన్నవరం : దావాజీగూడెం గ్రామంలో ఎంపిపి స్కూల్‌లో బుద్ధవరం సిపిఎం సర్పంచ్ బడుగు బాలమ్మ ప్రారంభించారు. హెచ్‌ఎం నవ భారతి, సచివాలయ సిబ్బంది,విద్యార్థులు పాల్గొన్నారు. ఉంగుటూరు : స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎంపిడిఒ జి.ఎస్.వి శేషగిరిరావు గోరుముద్దను ప్రారంభించారు. సర్పంచ్ కె.వర ప్రసాద్, శ్రీ కె.దుర్గాబాబు, రాష్ట్ర పరిశీలకులు ఎ.ప్రభాకరరావు, ప్రధానోపాధ్యాయులు, జి.వెంకటేశ్వరరావు , ఎం.ఇ.ఓ , పాఠశాల ఉపాధ్యాయులు యు.శ్రీనివాస్ పాఠశాల కో ఆప్షన్ మెంబర్ ఎన్.కవిత, సిఆర్‌పి పాల్గొన్నారు. హనుమాన్ జంక్షన్(గన్నవరం) : బాపులపాడు మండలం వీరవల్లీ జడ్పీ హైస్కూల్లో జగనన్న గోరుముద్దను సర్పంచ్ పిల్లా అనిత రామారావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు నిర్మల, ఎస్‌ఎంసి చైర్ పర్సన్ మద్ది రావమ్మ, ఉపాధ్యాయలు, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు. గన్నవరం జిల్లాపరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయిని నిమ్మగడ్డ రవీంధ్ర భవాని అధ్యక్షతన గన్నవరం జడ్.పి.టి.సి ఎలిజబెత్ రాణీ, పాఠశాల తల్లిదండ్రుల కమిటీ చైర్మన్ నిడమర్తి రామారావు చేతులమీదుగా ప్రారంభించారు.










