Nov 01,2023 20:23

సమావేశంలో మాట్లాడుతున్న సిపిఎం నాయకులు

ప్రజాశక్తి- దేవనకొండ
పోరాటాల ఫలితంగానే కరువు మండలాల ప్రకటన చేపట్టారని సిపిఎం జిల్లా నాయకులు బి.వీరశేఖర్‌, మండల నాయకులు అశోక్‌, సూరి, యూసుఫ్‌ తెలిపారు. బుధవారం వారు విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో కరువు నెలకొందని, రైతుల డిమాండ్‌ మేరకు కరువు మండలాల ప్రకటన చేపట్టారని తెలిపారు. కరువుగా ప్రకటించాలని పోరాడిన రైతుల పోరాటానికి విజయం దక్కిందని, రైతులను ఆదుకునేందుకు నిర్దిష్టమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈఏడాది ఖరీఫ్‌ సీజన్‌ మొదలైనప్పటి నుంచి అరకొర వర్షాలు కురిశాయని తెలిపారు. ఖరీఫ్‌ సీజన్‌లో కనీసం 15 రోజులు కూడా వర్షాలు కురవలేదని చెప్పారు. రైతులకు తీవ్ర నష్టం వాటిల్లిందని, రైతులను ఆదుకోవడం ప్రభుత్వ బాధ్యత అని తెలిపారు. గతేడాది కరువు నుండి రైతులు ఇంకా కోలుకోవడం లేదని, ఈఏడాది కూడా కరువుతో భారీగా అప్పుల్లో కూరుకుపోయారని చెప్పారు. సిపిఎం, రైతు సంఘం ఆధ్వర్యంలో రైతులతో కలిసి చేసిన పోరాటం విజయవంతమైందని తెలిపారు.