ప్రజాశక్తి-పార్వతీపురం : పోలింగ్ స్టేషన్ల రేషనలైజేషన్ కోసం ఈ నెల 23 తేదికి ప్రతిపాదనలు అందించాలని కలెక్టర్ నిశాంత్ కుమార్ తెలిపారు. అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఓటరు పునశ్చరణ కార్యక్రమం, పోలింగ్ స్టేషన్ల హేతుబద్ధీకరణపై జిల్లా కలెక్టర్ కార్యాలయంలో బుధవారం సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాకు 3170 వివి ప్యాట్లు కేటాయించారని, ఇప్పటికీ 2170 అందాయని తెలిపారు. బెంగళూరు బిఇఎల్ నుండి వచ్చిన వివి ప్యాట్లను రాజకీయ పార్టీ ప్రతినిధుల సమక్షంలో స్వీకరించినట్లు తెలిపారు. కొత్త ఇవిఎం మిషన్ల స్కానింగ్ గురు, శుక్రవారాల్లో జరుగుతుందన్నారు. ఈ నెల 20న నుంచి ఇవిఎంలను పరీక్షిస్తామని, సంబంధిత రాజకీయ పార్టీల ప్రతినిధులంతా సహకరించాలని కోరారు. అక్టోబర్ ఒకటో తేది నుంచి ఇవిఎంలు, వివి ప్యాట్లు మొదటి స్థాయి తనిఖీ చేపడుతున్నట్లు తెలిపారు. జిల్లాలో తొలగించిన ప్రతి ఓటూ క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లు చెప్పారు. జిల్లాలో అన్ని రకాల ఫారాలకు సంబంధించి మొత్తం దరఖాస్తులు 1,07,533 అందాయన్నారు. అందులో పాలకొండ నియోజక వర్గంలో 37386, కురుపాం నియోజకవర్గంలో 30738, పార్వతీపురం నియోజకవర్గంలో 16387, సాలూరు నియోజకవర్గంలో 23022 ఉన్నాయని చెప్పారు. ఇందులో 1445 తిరస్కరించగా, 3115 అంగీకరించామని, 64,365 ఓటరు జాబితాలో చేర్చామని, 38608 పెండింగ్‌లో ఉన్నాయని ఆయన వివరించారు. ఫారం-6 కింద 19,081 దరఖాస్తులు అందగా పాలకొండ నియోజకవర్గంలో 6451, కురుపాం నియోజకవర్గంలో 5979, పార్వతీపురం నియోజకవర్గంలో 2945, సాలూరు నియోజకవర్గంలో 3706 ఉన్నాయని చెప్పారు. ఫారం-7 ద్వారా 22,867 దరఖాస్తులు అందాయన్నారు. పాలకొండ నియోజకవర్గంలో 10703, కురుపాం నియోజకవర్గంలో 4980, పార్వతీపురం నియోజకవర్గంలో 3516, సాలూరు నియోజకవర్గంలో 3668 ఉన్నాయని చెప్పారు. ఓటరు జాబితాలో దిద్దుబాటు కోసం ఫారం-8 కింద 65,585 దరఖాస్తులు అందాయన్నారు. పాలకొండ నియోజకవర్గంలో 20,232, కురుపాం నియోజకవర్గంలో 19,779, పార్వతీపురం నియోజకవర్గంలో 9926, సాలూరు నియోజకవర్గంలో 15,648 ఉన్నాయని చెప్పారు. ఏప్రిల్ 15 నుండి సెప్టెంబర్ 12 వరకు 9700 ఓట్లు చేర్చగా పాలకొండ నియోజకవర్గంలో 4003, కురుపాం నియోజకవర్గంలో 2013, పార్వతీపురం నియోజకవర్గంలో 447, సాలూరు నియోజక వర్గంలో 3237 ఉన్నాయని వివరించారు. 7651 ఓట్లు తొలగించామన్నారు. అందులో పాలకొండ నియోజకవర్గంలో 4490, కురుపాం నియోజక వర్గంలో 1393, పార్వతీపురం నియోజక వర్గంలో 113, సాలూరు నియోజకవర్గంలో 1655 ఉన్నాయని చెప్పారు. 47,014 ఓటర్లకు చేర్పులు, మార్పులు చేసినట్లు తెలిపారు. పాలకొండ నియోజక వర్గంలో 15,032, కురుపాం నియోజకవర్గంలో 14,616, పార్వతీపురం నియోజకవర్గంలో 4872, సాలూరు నియోజకవర్గంలో 12,494 ఉన్నాయని చెప్పారు. సమావేశంలో జిల్లా రెవిన్యూ అధికారి జె.వెంకటరావు, హెచ్ సెక్షన్ సూపరింటెండెంట్ డి.రవికుమార్, సిపిఐ ప్రతినిధి కె.మన్మథరావు, సిపిఎం ప్రతినిధి పి.రాజశేఖర్, కాంగ్రెస్ ప్రతినిధి జె.భాస్కరరావు, టిడిపి ప్రతినిధి బి.డి చంద్రమౌళి, జనసేన పార్టీ ప్రతినిధి పైల శ్రీనివాసరావు, బిజెపి ప్రతినిధి పారిశర్ల అప్పారావు, బిఎస్‌పి ప్రతినిధి టి.వెంకటరమణ, లోక్‌సత్తా పార్టీ ప్రతినిధి కె.పాపారావు, తదితరులు పాల్గొన్నారు.










