Aug 04,2023 19:19

పోలింగ్‌ కేంద్రాలను పరిశీలిస్తున్న తహశీల్దార్‌ లక్ష్మీనారాయణ

ప్రజాశక్తి - చిప్పగిరి
ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు మండలంలో ప్రతి పోలింగ్‌ కేంద్రాన్ని పరిశీలిస్తున్నట్లు తహశీల్దార్‌ లక్ష్మీనారాయణ తెలిపారు. శుక్రవారం మండలంలోని కాజీపురం, కాజీపురం కొట్టాల, బంటనహాల్‌ గ్రామాల్లోని పోలింగ్‌ కేంద్రాలను, అందులోని వసతులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మండలంలో మొత్తం 29 పోలింగ్‌ కేంద్రాలు ఉన్నాయన్నారు. ఏ గ్రామంలోనైనా 1500 మంది ఓటర్లు పెరిగితే కొత్తగా పోలింగ్‌ కేంద్రం ఏర్పాటు చేసుకునేందుకు ఎన్నికల కమిషన్‌ అనుమతిస్తుందని తెలిపారు. 18 ఏళ్లు నిండిన ప్రతిఒక్కరూ 21 వరకు ఓటు హక్కును నమోదు చేసుకోవచ్చన్నారు. విఆర్‌ఒలు, గ్రామ సేవకులు పాల్గొన్నారు.