Apr 21,2023 21:51

సమావేశంలో పాల్గొన్న నాయకులు

రొద్దం : పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని నాయకులు డిమాండ్‌ చేశారు. మండల కేంద్రంలోని చెత్త సంపద కేంద్రంలో గురువారం దళిత, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సిపిఎం మండల అధ్యక్షుడు ఫకృద్దీన్‌ అధ్యక్షతన రౌండ్‌ టేబుల్‌ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సంఘాల నాయకులు మాట్లాడుతూ పోలీసు అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని సూచించారు. వారం రోజుల క్రితం కోగిర, శ్యాపురం గ్రామాల దళితులు, గిరిజనులు వారి భూముల్లో వ్యవసాయ పనులు చేసుకుంటుండగా కొందరు బలవంతంగా, దౌర్జన్యంగా భూముల్లోకి ప్రవేశించి కులం పేరుతో అసభ్య పదజాలంతో దూషించి దాడి చేసి పనులకు అడ్డుపడ్డారన్నారు. దీనిపై అదే రోజు స్థానిక పోలీస్‌ స్టేషన్లో ఫిర్యాదు చేసినా కేసులు నమోదు చేయకుండా కాలయాపన చేస్తున్నారన్నారు. దీంతో బాధితుల తరపున దళిత, గిరిజన, ప్రజా సంఘాలు సమస్యను ఉన్నతాధికారుల దష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగే వరకూ పోరాడుతామని సమావేశంలో ఏక గ్రీవంగా తీర్మానించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యద్శి గంగాధర్‌, వెంకటరాముడు, నారాయణ, కృష్ణప్ప, మారుతి, భూచెర్ల నరసింహులు, ఎంఆర్‌పిఎస్‌ నాయకులు నల్లూరు నాగరాజు, పంచాయతీ వర్కర్లు, తదితరులు పాల్గొన్నారు.