ప్రజాశక్తి-మచిలీపట్నంఅర్బన్ : జిల్లాలో అసాంఘిక కార్యకలాపాల నివారణ, నేర నియంత్రణకు పట్టిష్ట చర్యలు చేపట్టిన నేపథ్యంలో జిల్లా ఎస్‌పి జాషువా ఆదేశానుసారం పోలీసు యంత్రాంగం అనుమానితులు కదలికలు, బహిరంగ మధ్య సేవనంపై ఆదివారం విస్తత తనిఖీలు నిర్వహించారు. జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల సిబ్బంది వారి పరిధిలలో విస్తతంగా వాహన తనిఖీలు చేశారు. అలాగే రహదారి ప్రమాదాల నివారణకు ప్రత్యేక చొరవ తీసుకొని డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేస్తూ, తాగి వాహనాలు నడిపిన వారిని అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల కాలంలో జరుగుతున్న నేరాలను దష్టిలో పెట్టుకొని అనుమానితుల కదలికలపై ప్రత్యేక నిఘాను ఏర్పరిచి ఎవరైనా అనుమానాస్పదంగా తారస పడితే మొబైల్ సెక్యూరిటీ చెక్ డివైస్ (ఎంఎస్సిడి) తో వేలిముద్రలు సేకరించారు. గతంలో వారి నేర చరిత్రను పరిశీలించి, కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ 93, బహిరంగ మద్య సేవనం 148, ఎంఎస్సిడితో 4 గురు అనుమానితులను జిల్లా వ్యాప్తంగా గుర్తించి కేసులు నమోదు చేశారు.










