పోలీసు స్టేషన్ రికార్డుల తనిఖీ
పోలీసు స్టేషన్ రికార్డుల తనిఖీ
ప్రజాశక్తి- యర్రావారిపాలెం: మండల పోలీస్ స్టేషన్‌ను తిరుపతి ఎస్‌పి పి పరమేశ్వర్ రెడ్డి శనివారం తనిఖీ చేశారు. అనంతరం పోలీస్ స్టేషన్‌లో సీఐ సురేంద్రనాథ్ రెడ్డి, ఎస్‌ఐ ఈశ్వరయ్య, సిబ్బందితో సమావేశం ఏర్పాటు చేశారు. మండలంలో శాంతి భద్రతలు, క్రైమ్ కేసులు రికార్డులు మొదలైన సమస్యలు పరిశీలించారు. రానున్న ఎన్నికల గురించి, రాజకీయ పార్టీల నాయకుల గురించి అడిగి తెలుసుకొని దశ నిర్దేశం చేసి పలు సూచనలు, సలహాలు ఇచ్చారు.










