Sep 26,2023 21:42

పోలీసు సిబ్బందితో మాట్లాడుతున్న ఎస్పీ అన్బురాజన్‌

        అనంతపురం క్రైం : జిల్లా పోలీసు సిబ్బంది సంక్షేమానికి ప్రాధాన్యతను ఇస్తున్నామని ఎస్పీ కెకెఎన్‌ అన్బురాజన్‌ స్పష్టం చేశారు. మంగళవారం స్థానిక పోలీస్‌ కాన్ఫరెన్స్‌ హాల్లో ఆయన పోలీస్‌ వెల్ఫేర్‌ కమిటీలతో సమావేశం నిర్వహించారు. జిల్లాలో పోలీసు, వారి కుటుంబాల కోసం ప్రస్తుతం ఎలాంటి సంక్షేమ చర్యలు అమలవుతున్నాయన్న విషయాలపై సమీక్షించారు. వీటిని కొనసాగించడంతో పాటు మరిన్ని కొత్త సంక్షేమ చర్యలు అమలు చేయాలని సూచించారు. ప్రధానంగా పోలీసు సిబ్బంది ఆరోగ్యంపై దష్టి పెట్టాలన్నారు. సబ్సిడీ ధరలతో సరుకులు అందజేసే పోలీసు క్యాంటీన్‌లో హోంగార్డుల నుండి అధికారుల వరకు వారి ఖాతాల్లో నగదు లేకపోయినప్పటికీ రూ.5 నుంచి 10 వేల వరకు సరుకులు ఇచ్చి తరువాత జీతంలో తీసుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీసు స్టేషన్లలో మరుగుదొడ్లు ఇతర సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరించాలన్నారు. గార్డు సిబ్బందికి తాగునీరు తదితర మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. క్షేత్రస్థాయిలో సిబ్బందికి ఏవైనా సమస్యలుంటే పోలీసు వెల్ఫేర్‌ కమిటీ తన దష్టికి తీసుకు రావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీలు ఆర్‌ విజయభాస్కర్‌ రెడ్డి, ఎం.హనుమంతు (ఏఆర్‌), ఏఆర్‌ డీఎస్పీ మునిరాజ్‌, ఆర్‌ఐ రాముడు, ఏఓ శంకర్‌, ఎస్పీ సీసీ ఆంజనేయ ప్రసాద్‌, వెల్ఫేర్‌ ఆర్‌ఎస్‌ఐ రమేష్‌ నాయక్‌, జిల్లా పోలీసు అధికారుల సంఘం అడ్హాక్‌ కమిటీ సభ్యులు సాకే త్రిలోకనాథ్‌, సుధాకర్‌ రెడ్డి, తేజ్‌ పాల్‌, గాండ్ల హరినాథ్‌, సరోజ, శ్రీనివాసులు నాయుడు, రమణ పాల్గొన్నారు.