May 16,2023 22:34

శాంతిభద్రతలపై చర్చిస్తున్న డిఐజి

పెనుకొండ : పెనుకొండ పోలీస్‌ స్టేషన్‌ను అనంతపురం రేంజ్‌ డిఐజి ఆర్‌ ఎన్‌ అమ్మిరెడ్డి మంగళవారం తనిఖీ చేశారు. ఈ సందర్బంగా పోలీసు స్టేషన్‌ నిర్వహణ, సిబ్బంది పనితీరు, విధులు, ముఖ్యమైన కేసుల దర్యాప్తును పరిశీలించారు. విజిబుల్‌ పోలీసింగ్‌, గ్రామాల సందర్శనలపై దృష్టిపెట్టాలని సూచించారు. వాహనాల తనిఖీలు ముమ్మరం చేయాలన్నారు.సమస్యాత్మక గ్రామాల పట్ల అప్రమత్తంగా ఉండాలని తాజా పరిస్థితులపై దృష్టి సారించి సమస్యలు ఉత్పన్నం కాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని కోరారు. పోలీసు స్టేషన్లకు బాధలతో వచ్చే ప్రజలు సంతృప్తితో వెళ్లేలా చర్యలు ఉండాలని తెలిపారు. సైబర్‌ నేరాలపై దృష్టి పెట్టాలని, మహిళలపై జరిగే నేరాలు, గుడ్‌ టచ్‌ బ్యాడ్‌ టచ్‌ , మహిళా చట్టాల గురించి ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. వారంలో ఒకరోజు పోలీసు స్టేషన్లో 'కాఫీ విత్‌ మెన్‌' కార్యక్రమం నిర్వహించి పోలీసు స్టేషన్‌ సిబ్బందిని, ఆ పరిధిలో ఉన్న గ్రామ, వార్డు సచివాలయాల మహిళా పోలీసులతో సమావేశం నిర్వహించాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో పెనుకొండ సిఐ కరుణాకర్‌, కియా ఎస్‌ఐ వెంకటరమణ, పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.